మన జీవితం క్రికెట్ మ్యాచ్ లాంటిది... ఏపీ సీఎస్ సంచలన వ్యాఖ్యలు

ఎవరు రెచ్చిగొట్టినా సహనంతో ముందుకు వెళ్లాసిందే అని ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. సహనం కోల్పోతే ఉద్యోగం కోల్పోతామని అన్నారు. అలా ఉద్యోగం పొగొట్టుకున్న వారి గురించి తనకు తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: April 20, 2019, 11:49 AM IST
మన జీవితం క్రికెట్ మ్యాచ్ లాంటిది... ఏపీ సీఎస్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ సీఎస్ఎల్వీ సుబ్రమణ్యం(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: April 20, 2019, 11:49 AM IST
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు. సివిల్ సర్వీస్ అధికారుల జీవితం క్రికెట్ మ్యాచ్ లాంటిదని వ్యాఖ్యానించిన ఎల్వీ సుబ్రహ్మణ్యం... మనం ఒక్క బాల్ సరిగ్గా ఆడకపోయినా ఔట్ కావాల్సిందే అని అన్నారు. ఎవరు రెచ్చిగొట్టినా సహనంతో ముందుకు వెళ్లాసిందే అని స్పష్టం చేశారు. సహనం కోల్పోతే ఉద్యోగం కోల్పోతామని అన్నారు. అలా ఉద్యోగం పొగొట్టుకున్న వారి గురించి తనకు తెలుసు అని వ్యాఖ్యానించారు. ఏపీ సచివాలయంలో జరిగిన సివిల్ సర్వీసెస్ డే వేడుకల్లో పాల్గొన్న ఎల్వీ సుబ్రమణ్యం... ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు.

నిజాయితీ, హుందాగా ఉండటం తన బాధ్యత అని చెప్పిన ఆయన... అధికారులకు రోడల్ మోడల్‌గా ఉండాల్సిన బాధ్యత నాపై ఉందని తెలిపారు. ఇక బ్లాక్ 2లో ఉద్యోగమైనా బ్లాక్ 1లో ఉద్యోగమైనా ఒకటే అని ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. బ్లాక్ 1లో ముఖ్యమంత్రి కార్యాలయం ఉంటుంది. అక్కడ పనిచేసే అధికారులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందనే భావన అధికారవర్గాల్లో కనిపిస్తుంటుంది. అయితే ఎక్కడ పనిచేసే అధికారులైనా ఒక్కటే అని ఎల్వీ సుబ్రహ్మణ్యం చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై చేస్తున్న ఆరోపణలకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం పరోక్షంగా సమాధానం ఇచ్చారని అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది.First published: April 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...