మా శ్రమంతా వృధా చేశారు.. జగన్‌ తీరుపై చంద్రబాబు అసంతృప్తి...

తాను ఎంతో కష్టపడి తాను లులు గ్రూప్‌ను ఏపీకి తీసుకొస్తే.. రాష్ట్ర ప్రభుత్వం తెలివి తక్కువ నిర్ణయాలతో దాన్ని సాగనంపేసిందని చంద్రబాబు మండిపడ్డారు.

news18-telugu
Updated: November 21, 2019, 7:25 PM IST
మా శ్రమంతా వృధా చేశారు.. జగన్‌ తీరుపై చంద్రబాబు అసంతృప్తి...
చంద్రబాబు (File)
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో లులు గ్రూప్‌కు ప్రభుత్వం భూ కేటాయింపులు రద్దు చేయడంపై మాజీ సీఎం చంద్రబాబునాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి తాను లులు గ్రూప్‌ను ఏపీకి తీసుకొస్తే.. రాష్ట్ర ప్రభుత్వం తెలివి తక్కువ నిర్ణయాలతో దాన్ని సాగనంపేసిందని మండిపడ్డారు. ఈ మేరకు ప్రభుత్వ తీరును నిరసిస్తూ ట్వీట్ చేశారు. ‘ఎన్నో సంప్రదింపులు జరిపి, నిరంతరం వెంటపడి లూలూ గ్రూప్ ను ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు ఒప్పించాం. ఈ ప్రాజెక్టుతో విశాఖలో వేల ఉద్యోగాలు వచ్చేవి. స్థానికంగా ఆర్థిక అభివృద్ధి జరిగేది. జగన్ ప్రభుత్వ తెలివితక్కువ నిర్ణయాల కారణంగా మా శ్రమంతా వృధా అయ్యింది.’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇలా జరిగినందుకు చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలు, విశాఖ ప్రజల తరఫున విచారం వ్యక్తం చేస్తున్నట్టు మరో ట్వీట్ చేశారు. ‘బాధ్యత లేని ఇలాంటి చర్యలు వ్యాపార అనుకూల వాతావరణాన్ని దెబ్బతీస్తాయి. యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తాయి. లూలూ గ్రూప్ కు ఇలా జరిగినందుకు ఏపీ ప్రజల తరపున, ముఖ్యంగా విశాఖవాసుల తరపున విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను.’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

First published: November 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...