ఎస్ఈసీ రమేష్ కుమార్‌‌‌కు రాంరాం... జగన్ అస్త్రం సిద్ధం?

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ ఎస్ఈసీ రమేష్ కుమార్ నిర్ణయం తీసుకోవడడం రాష్ట్రంలో పెను సంచలనానికి దారి తీసింది.

news18-telugu
Updated: April 10, 2020, 2:51 PM IST
ఎస్ఈసీ రమేష్ కుమార్‌‌‌కు రాంరాం... జగన్ అస్త్రం సిద్ధం?
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్, సీఎం వైఎస్ జగన్
  • Share this:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తొలగించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆర్డినెన్స్ ద్వారా ఆయనను ఇంటికి పంపేందుకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. అందుకోసం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం - 1994లో మార్పులు తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్టు ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెబ్‌సైట్ కథనాన్ని ప్రచురించింది. ఎలక్షన్ కమిషనర్ నియామకం ప్రక్రియ, పదవీ కాలం, అర్హతలను మార్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ ఎలాంటి పక్షపాతం లేకుండా ఉండేందుకే ఇలా చేస్తున్నట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం ప్రన్సిపల్ సెక్రటరీ స్థాయి, ఆ పై అధికారి మాత్రమే రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా నియమించడానికి అర్హులు. అంటే ఓ రకంగా బ్యూరోక్రాట్లు మాత్రమే ఆ పదవిని చేపట్టే అవకాశం ఉంది. అయితే, జగన్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చే ఆర్డినెన్స్ ద్వారా హైకోర్టు జడ్జిగా పనిచేసిన వారికి మాత్రమే ఎస్ఈసీగా పనిచేసే అవకాశం దక్కనుంది.

దీంతోపాటు ఎస్ఈసీ పదవీకాలం అంశంలో కూడా మార్పులు చేయనుంది. ప్రస్తుతం ఐదేళ్లు పదవీకాలం ఉంది. అయితే, దాన్ని మూడు సంవత్సరాలకు తగ్గించే అవకాశం ఉంది. అలాగే, ఆరేళ్లకు మించి ఆ పదవిలో ఉండడానికి వీల్లేకుండా ఆర్డినెన్స్‌లో పొందుపరిచే అవకాశం ఉంది. ప్రస్తుతం పంచాయతీ రాజ్ చట్టంలో మార్పులు చేసి, దాన్ని అసెంబ్లీలో ఆమోదం పొందే చాన్స్ లేదు కాబట్టి, ఆర్డినెన్స్ ద్వారా రమేష్ కుమార్‌ను సాగనంపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే, అంతకంటే ముందు దీనికి కేబినెట్ అనుమతి కావాలి. ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో మంత్రులు అందరూ తమ తమ జిల్లాల్లో ఉన్నారు. ఈ అంశంపై వారి అభిప్రాయాన్ని త్వరగా తెలియజేయాలని మంత్రులను ఆదేశించారు.

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ ఎస్ఈసీ రమేష్ కుమార్ నిర్ణయం తీసుకోవడడం రాష్ట్రంలో పెను సంచలనానికి దారి తీసింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన సామాజిక వర్గం నేత అయిన చంద్రబాబు చెప్పినట్టు నడుచుకుంటున్నారంటూ సీఎం జగన్ సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై రాజకీయ పక్షాల నుంచి విమర్శలు వచ్చాయి. ఎస్ఈసీకి కూడా కులం అంటగడతారా అంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి. అయితే, రాజ్యాంగ పదవిలో ఉన్న ఎస్ఈసీ రమేష్ కుమార్‌ను తొలగించాలని జగన్ ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టు రాజకీయవర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
First published: April 10, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading