మీరున్నారని గుర్తుండేలా చేసి వెళ్లండి... గవర్నర్‌తో జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

సచివాలయం భవనాలను కూల్చివేత జరగకుండా అడ్డుకోవాలని విపక్ష నేతల బృందం గవర్నర్ నరసింహన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.

news18-telugu
Updated: July 15, 2019, 7:07 PM IST
మీరున్నారని గుర్తుండేలా చేసి వెళ్లండి... గవర్నర్‌తో జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
నరసింహన్‌తో జానారెడ్డి(ఫేస్ బుక్ ఇమేజ్)
  • Share this:
కొత్త సచివాలయం,అసెంబ్లీ నిర్మాణాలను అడ్డుకోవాలని విపక్ష నేతలు గవర్నర్ నరసింహన్‌కు విజ్ఞప్తి చేశారు. సెక్షన్ 8 ప్రకారం గవర్నర్‌కు ఆస్తులను కాపాడే అధికారం ఉందని మాజీ ఎంపి వివేక్ అన్నారు. సచివాలయం కూల్చివేతను నిలిపివేయాలని...కొత్త సచివాలయం, అసెంబ్లీ నిర్మించొద్దని గవర్నర్ ను కోరామని ఆయన తెలిపారు. సచివాలయ భవనాల కూల్చివేత నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే సుప్రీంకోర్టు ఆశ్రయిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించి... ఆ తరువాత భవనాలు కడితే బాగుంటుందని టీ టీడీపీ నేత ఎల్.రమణ అన్నారు.

Opposition leaders meet governor narasimhan,secretariat building dismantle,janareddy,revanth reddy,shabbir ali,congress,kodandaram,dk aruna,governor narasimhan,vivek,గవర్నర్ నరసింహన్‌తో విపక్ష నేతల భేటీ,రేవంత్ రెడ్డి,జానారెడ్డి,షబ్బీర్ అలీ,కోదండరామ్
రాజ్ భవన్‌లో గవర్నర్‌ను కలిసి విపక్ష నేతలు


ఇక గవర్నర్‌కు విపక్ష నేతలకు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఏం జరుగుతోందంటూ కాంగ్రెస్ నేతలను షబ్బీర్ అలీ, రేవంత్ రెడ్డిని గవర్నర్ అడిగారు. అయితే ఈ సమయంలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ... మీరు మమ్మల్ని పట్టించుకోవడం లేదని, కేవలం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను మాత్రమే పట్టించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన గవర్నర్... ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ వేదికలపై చేసుకోవాలని ఆయనపై ఒకింత అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ సమావేశం ముగింపు సందర్భంగా గవర్నర్‌తో జానారెడ్డి మాట్లాడారు. గవర్నర్‌గా మీరున్నారు అని గుర్తుండేలా చేసి వెళ్ళండి అని వ్యాఖ్యానించారు.
Published by: Kishore Akkaladevi
First published: July 15, 2019, 7:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading