Parliament: పార్లమెంట్‌లో కొనసాగుతున్న రగడ.. తగ్గని విపక్షాలు.. ప్రధాని మోదీ ఆగ్రహం

రాహుల్ గాంధీ, నరేంద్రమోదీ (ఫైల్ ఫోటో)

Parliament: పార్లమెంట్ ప్రారంభమైన వెంటనే పెగాసస్ అంశంపై ఉభయ సభలు దద్దరిల్లాయి. పెట్రోల్ ధరలు, పెగాసస్‌పై చర్చ జరపాలంటూ లోక‌సభ, రాజ్యసభ‌లో విపక్షాలు ఆందోళనకు దిగాయి.

  • Share this:
    పార్లమెంట్‌లో పెగాసెస్ సహా ఇతర అంశాలపై విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. ప్రతిపక్ష పార్టీలు సభను స్తంభింపజేస్తున్నాయి. అంతకుముందుకు లోక్‌సభ, రాజ్యసభకు చెందిన విపక్ష నేతలు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఏర్పాటు చేసిన బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌కు హాజరయ్యారు. ఎన్సీపీ, శివసేన, ఆర్జేడీ, ఎస్పీ, సీపీఐ, సీపీఎం, ఆర్ఎస్‌పీ, కేరళ కాంగ్రెస్‌, జార్ఖండ్ ముక్తి మోర్చా, నేషనల్ కాన్ఫరెన్స్‌, తృణమూల్ కాంగ్రెస్‌, లోకతాంత్రిక్ జనతాదళ్ పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా మనం అంతా కలిసి పోరాడాలని రాహుల్ వారిని కోరారు. విపక్ష పార్టీ నేతలతో బ్రేక్‌ఫాస్ట్ ముగిసిన తర్వాత.. రాహుల్ గాంధీ పార్లమెంట్‌కు సైకిల్ యాత్ర. ఆ ర్యాలీలో విపక్ష ఎంపీలు కూడా పాల్గొన్నారు.

    పార్లమెంట్ ప్రారంభమైన వెంటనే పెగాసస్ అంశంపై ఉభయ సభలు దద్దరిల్లాయి. పెట్రోల్ ధరలు, పెగాసస్‌పై చర్చ జరపాలంటూ లోక‌సభ, రాజ్యసభ‌లో విపక్షాలు ఆందోళనకు దిగాయి. ఈ రెండు అంశాలపై చర్చ జరపాల్సిందేనని పట్టుబట్టాయి. రాజ్యసభలో పెద్ద పెద్ద నినాదాలు చేస్తూ ఛైర్మన్ వెల్ వైపు దూసుకెళ్లేందుకు విపక్ష ఎంపీలు ప్రయత్నించారు. దీంతో అధికార ఎంపీలు కూడా నిరసన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష ఎంపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

    పరస్పర నినాదాలతో రాజ్యసభలో గందరగోళం నెలకొంది. దీంతో రాజ్యసభను ఛైర్మన్ వాయిదా వేశారు. మరోవైపు లోక్‌సభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. విపక్షాల అరుపుల మధ్యే వాయిదా తీర్మానాలపై చర్చిస్తున్నారు. సభను అదుపుచేసేందుకు స్పీకర్ ప్రయత్నించినా విపక్ష ఎంపీల ఆందోళన కొనసాగింది. ఇదిలా ఉంటే పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రధాని నరేంద్రమోదీ ప్రయత్నించారు. విపక్ష ఎంపీలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. పార్లమెంట్ ఉభయసభల్లో విపక్ష సభ్యుల తీరుపై మోదీ అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష సభ్యులు తీరు మార్చుకోవాలని సూచించారు. పార్లమెంట్ సమావేశాలకు సహకరించాలని కోరారు.
    Published by:Kishore Akkaladevi
    First published: