Bihar Polls 2020: బీహార్ ను ఏలేది వాళ్లేనా..! తేల్చిన లోక్ నీతి-సీఎస్డీఎస్ సర్వే

దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బీహార్ ఫలితంపై ఒపినీయన్ పోల్స్ వచ్చేశాయి. కరోనా కాలంలో జరుగుతుండటం.. లాక్డౌన్ కారణంగా వలసలకు తిరిగి స్వంత ఇంటికి తిరిగి వెళ్లినవారిలో ఎక్కువమంది బీహార్ నుంచే ఉండటంతో వారంతా ఎటువైపు మొగ్గుచూపుతారోనని దేశ ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.

news18
Updated: October 21, 2020, 11:06 AM IST
Bihar Polls 2020: బీహార్ ను ఏలేది వాళ్లేనా..! తేల్చిన లోక్ నీతి-సీఎస్డీఎస్ సర్వే
ఫైల్ ఫోటో
  • News18
  • Last Updated: October 21, 2020, 11:06 AM IST
  • Share this:
త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో గెలవబోయేదెవరో తెలిసిపోయింది. ఈ మేరకు ఎన్నికలకు ముందే ఒపినీయన్ పోల్స్ విడుదల చేసే లోక్ నీతి-సీఎస్డీఎస్ తన సర్వేను విడుదల చేసింది. దేశంలో ఎన్నో సంస్థలు ఎన్నికలకు ముందు సర్వేలు విడుదల చేసినా.. లోక్ నీతి-సీఎస్డీఎస్ సర్వే ప్రామాణికంగా ఉంటుందని విశ్లేషకుల అభిప్రాయం. అయితే.. త్వరలో జరగనున్న బీహార్ లో అధికారంలోకి వచ్చేది ఎన్డీయే కూటమేనని ఆ సర్వేలో వెల్లడైంది. పదిహేనేళ్లుగా బీహార్ ను పాలిస్తున్న నితీశ్ కుమారే తిరిగి సీఎం కాబోతున్నాడంటూ తెలిపింది. జేడీ(యూ), బీజేపీ తో పాటు మరి కొన్ని ప్రాంతీయ పార్టీలతో ఏర్పాటైన ఎన్డీయే కూటమి విజయం నల్లేరు మీద నడకేనని ఆ సర్వే తెలిపింది. ఈ మేరకు సర్వే వివరాలను విడుదల చేసింది.

మొత్తం 243 స్థానాలున్న బీహార్ లో.. జేడీ(యూ), బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ఈ ఎన్నికలలో 133 నుంచి 143 స్థానాల వరకు గెలుస్తుందని లోక్ నీతి-సీఎస్డీఎస్ సర్వే అంచనా వేసింి. ఆర్జేడీ-కాంగ్రెస్ ఆధ్వర్యంలోని మహాకూటమికి 88 నుంచి 98 వరకు సీట్లు రావొచ్చని అభిప్రాయపడింది. కేంద్ర మాజీ మంత్రి రాం విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) కి రెండు నుంచి ఆరు సీట్లు రావొచ్చునని తెలిపింది. ఇతరులు ఆరు నుంచి పది స్థానాల్లోపు గెలవొచ్చునని పేర్కొంది.

ఇంకా సర్వేలో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఓట్ల శాతం పరంగా చూసుకుంటే.. ఎన్డీయే కూటమికి 38 శాతం ఓట్లు వస్తాయని సర్వే తెలిపింది. మహాకూటమికి 32 శాతం.. ఎల్జేపీకి ఆరు శాతం ఓట్లు వస్తాయి. స్వతంత్రులు, ఇతరులు కలిసి 24 శాతం ఓట్లను పొందనుండటం గమనార్హం. ఇక ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ అభ్యర్థిత్వాన్ని 31 శాతం మంది ఆమోదించగా.. 27 శాతం మంది ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ ను సీఎంగా చూడాలనుకుంటున్నట్టు తెలిపారు. చిరాగ్ పాశ్వాన్ కు 5 శాతం మంది జై కొట్టారు.

ఇదిలాఉండగా.. చిరాగ్ పాశ్వాన్ మాత్రం.. తాను జేడీ(యూ) కంటే రెండు సీట్లైనా ఎక్కువ గెలుస్తానని శపథాలు చేస్తున్నారు. తన తండ్రి మరణం తర్వాత ఆయన మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ నుంచి రెబెల్స్ కు ఎరవేస్తూ వారికి సీట్లు ఇస్తున్నారు. ఈ మేరకు ఈ రోజు ఆయన తన తొలి జాబితాను ప్రకటించనున్నారు. రాష్ట్రంలో జేడీ(యూ) కు ఓటు వేస్తే అది బీహార్ కు మరణశాసనమేనని.. రాష్ట్రంలో తర్వాత ఏర్పడబోయేది ఎల్జేపీ-బీజేపీ ల కూటమేనని చెబుతున్నారు. మరోవైపు ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ కూడా సీఎం నితీశ్ పై విమర్శల దాడిని పెంచారు. ప్రభుత్వ ఏర్పాటులో అవసరమైతే ఎల్జేపీ సహకారం కూడా తీసుకుంటామని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.

ఏదేలాఉన్నా.. విజయంపై ఎన్డీయే కూటమి మాత్రం ధీమాగా ఉంది. తమ ముఖ్యమంత్రి అభ్యర్థి నితీశేనని ఇప్పటికే చాలా సార్లు స్పష్టం చేసిన ఆ కూటమి.. ఆ మేరకు ప్రచారం కూడా జోరుగా చేస్తున్నది. మరి సర్వేలు నిజమైతాయా..? ప్రజల మనసులో ఏముందో తెలుసుకోవాలంటే నవంబర్ 10 దాకా వేచి చూడాల్సిందే..
Published by: Srinivas Munigala
First published: October 21, 2020, 11:06 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading