• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • OPINION KEY LESSONS FROM GUJARAT LOCAL BODY ELECTIONS FOR OUR POLITICAL CLASS BA GH

OPINION | గుజరాత్‌ స్థానిక సంస్థల ఎన్నికల ఎన్నికల నుంచి రాజకీయనేతలు నేర్చుకోవాల్సిన పాఠాలు

OPINION | గుజరాత్‌ స్థానిక సంస్థల ఎన్నికల ఎన్నికల నుంచి రాజకీయనేతలు నేర్చుకోవాల్సిన పాఠాలు

(ప్రతీకాత్మక చిత్రం)

ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా గుజరాత్‌లో కులం పెద్దగా ప్రభావం చూపదని మోదీ నిరూపించే ప్రయత్నం చేశారు. ఈ వ్యూహంలో భాగంగానే సీఆర్ పాటిల్ వంటి సాధారణ వ్యక్తిని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. ఆయన ఏ ఆధిపత్య కులానికి చెందినవాడు కాదు.

  • Share this:
(Japan K Pathak, News18.com కోసం రాసిన వ్యాసం)

గుజరాత్‌ రాజకీయాలను, నరేంద్ర మోదీని వేరు చూసి చూడలేం. అయితే 2014లో మోదీ ప్రధాని పగ్గాలు చేపట్టిన తరువాత ఆ రాష్ట్రంలో నాయకత్వ లోపం ఏర్పడిందని చాలామంది విశ్లేషకులు భావించారు. దీనికి తోడు 2015 జూలై-ఆగస్టులో పాటీదార్ ఆందోళన బీజేపీకి తలనొప్పిగా మారింది. బలమైన సామాజిక వర్గాలు కాషాయ పార్టీకి దూరంగా జరిగాయి. అదే సమయంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ విజయం సాధించి బీజేపీ నాయకత్వానికి సవాల్ విసిరింది. పట్టణ ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ గణనీయమైన ప్రభావం చూపింది. అప్పట్లో తాలూకా పంచాయతీల్లో కాంగ్రెస్ 134 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 67 స్థానాలకే పరిమితమైంది. జిల్లా పంచాయతీల్లో కాంగ్రెస్ 24 స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీ ఆరు జిల్లా హెడ్ క్వార్టర్లకే పరిమితమైంది. దీంతో గుజరాత్‌లో ఎక్కడ ప్రభ కోల్పోతామోనని భాజపా అధినాయకత్వం ఆందోళన చెందింది.

2017లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. అప్పుడు కూడా కాంగ్రెస్ మెరుగైన స్థానాలనే గెల్చుకుంది. ఆ పార్టీకి గ్రామీణ ప్రాంతాల నుంచి మంచి ఆదరణ లభించింది. ఎన్నికల్లో మొత్తం 77 సీట్లు గెలుచుకుంది. 2015 స్థానిక ఎన్నికల్లో సాధించిన విజయాలు 2017 అసెంబ్లీ ఎన్నికల వరకు విస్తరించాయి. కానీ తాజాగా జరిగిన 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి దారుణమైన పరాభవం ఎదురైంది.

దారుణంగా దెబ్బతిన్న కాంగ్రెస్
గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఘోరంగా దెబ్బతిన్నది. 2015, 2017లో ఆ పార్టీ సాధించిన విజయాలతో అదిష్టానం సంబరపడింది. బీజేపీకి తాము ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నామని కాంగ్రెస్ భావించింది. కానీ ఈసారి రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌ను పూర్తిగా తిరస్కరించారు. గుజరాత్ అభివృద్ధి నమూనాకే అక్కడి ప్రజలందరూ కట్టుబడి ఉన్నారని తాజా ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి. గుజరాత్ పట్టణ ప్రాంతాల్లో జీజేపీ విజయంపై ఎవరికీ అనుమానాలు లేనప్పటికీ, చాలా స్థానాల్లో ఆ పార్టీకి ఊహించని మోజార్టీ వచ్చింది. రాజ్ కోట్, అహ్మదాబాద్, భావ్ నగర్, వడోదర, జామ్ నగర్.. వంటి ప్రాంతాల్లో పార్టీ సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించింది. సూరత్‌లోనూ భారీ విజయాలు నమోదయ్యాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందిన స్థానాలకంటే పది రెట్లు ఎక్కువ స్థానాలను భాజపా గెల్చుకోవడం విశేషం. అన్ని జిల్లా పంచాయతీల్లోనూ కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. తాలూకా పంచాయితీల్లో కూడా ఆ పార్టీ భంగపడింది.

పనిచేయని వ్యతిరేక ప్రచారం
ఈ ఫలితాలను బట్టి చూస్తే మొత్తం గుజరాత్ నరేంద్ర మోదీకి మద్దతిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో ప్రధానికి మద్దతు క్రమంగా పెరుగుతోందని తెలుస్తోంది. మోదీపై చేసే వ్యతిరేక ప్రచారాన్ని ప్రజలు నమ్మట్లేదని ఓటర్ల సరళిని బట్టి చెప్పవచ్చు. రాహుల్‌ గాంధీ, ఇతర విపక్ష నేతలు మోదీని తక్కువ చేసి మాట్లాడితే గుజరాతీలు తీవ్రంగా స్పందిస్తారని అర్థమవుతోంది. తాజా పంచాయతీ ఎన్నికల్లో కింది స్థాయి అంశాలపై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టి సారించలేదు. కేవలం ప్రధానమంత్రిని వ్యక్తిగత లక్ష్యంగా చేసుకొనే విమర్శలు గుప్పించింది. మోదీ లక్ష్యంగానే ఆ పార్టీ నేతలు ప్రచారం చేశారు. దీంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజలకు చేసిందేమీ లేదనే భావన కూడా గ్రామీణుల్లో ఉంది. ఫలితంగా 2015, 2017లో బీజేపీ ఓడిపోయిన అమ్రేలి వంటి జిల్లాల్లో ప్రస్తుతం పరిస్థితులు మారాయి. అప్పట్లో కాంగ్రెస్ గెలిచిన చాలా జిల్లాల్లో ఇప్పుడు భాజపా విజయ కేతనం ఎగురవేసింది. అమ్రేలి జిల్లాలో కాంగ్రెస్‌కు మద్దతిచ్చే పాటీదార్లు ఎక్కువగా ఉన్నారు. కానీ వీరందరూ ఈసారి భాజపాకే ఓటు వేయడం విశేషం.

ఓటమి నుంచి పాఠాలు
ఎన్నికల్లో ప్రతి చిన్న విషయం పెద్ద ప్రభావం చూపుతుందని భాజపాకు అర్థమైంది. 2015లో ఎదురైన పరాభవంతో ఆ పార్టీ నాయకత్వం మేల్కొంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలనే తేడాలు లేకుండా నాయకులు పార్టీని ప్రజలకు చేరువ చేయగలిగారు. తమ హయాంలో చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు తెలియజెప్పారు. మోదీని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకున్న కాంగ్రెస్‌పై వ్యతిరేకత కూడా భాజపాకు కలిసివచ్చింది.

వ్యవసాయ చట్టాలకు అనుకూలమేనా?
గత స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో భాజపా ఘోరంగా ఓడిపోయింది. దీనికి తోడు ప్రస్తుతం కొత్త వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు దేశవ్యాప్తంగా వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని గ్రామీణులు భాజపాకు మద్దతిస్తారా లేదా అనే అనుమానాలు పటాపంచలయ్యాయి. గుజరాత్‌లో చిన్న రైతులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అక్కడి విజయాలను బట్టి చూస్తే రైతులందరూ వ్యవసాయ చట్టాలకు మద్దతిస్తున్నారని అర్థమవుతోంది. గుజరాతీ రైతులు వ్యవసాయంలో సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ముందుంటారు. సహకార రంగం అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో గుజరాత్ ముందు ఉంది. దీనికి తోడు మోదీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరవు పీడిత ప్రాంతాలకు కూడా నీళ్లు అందించగలిగారు. దీంతో కచ్, బనస్కంతా వంటి కరవు జిల్లాల్లో సైతం వ్యవసాయంలో ఉత్పాదకత భారీగా పెరిగింది. అప్పటి సీఎం కృషితో రైతులు కాంట్రాక్టు వ్యవసాయంలో విజయం సాధించారు. తక్కువ కాలంలో మంచి లాభాలను పొందగలిగారు. నీటిపారుదల వ్యవస్థ కూడా ఎంతో మెరుగైంది. అందువల్ల గుజరాత్‌లో వ్యవసాయ చట్టాలపై వ్యతిరేక ప్రచారాస్త్రం పనిచేయలేదు.

వ్యూహాలతో సాధ్యమైన గెలుపు
ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా గుజరాత్‌లో కులం పెద్దగా ప్రభావం చూపదని మోదీ నిరూపించే ప్రయత్నం చేశారు. ఈ వ్యూహంలో భాగంగానే సీఆర్ పాటిల్ వంటి సాధారణ వ్యక్తిని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. ఆయన ఏ ఆధిపత్య కులానికి చెందినవాడు కాదు. అయినా క్యాడర్‌లో ఉత్సాహాన్ని నింపగలిగారు. మోదీ పాలనలో సాధించిన సంస్థాగత బాలానికి ప్రస్తుత విజయాలు నిదర్శనమని ఆయన అభిమానులు చెబుతున్నారు. వ్యవస్థలను బలోపేతం చేయడంలో మోదీని మించినవారు లేరనే మద్దతుదారుల ప్రచారం కూడా విజయాలకు కలిసి వచ్చింది. మొత్తానికి ఆ రాష్ట్రంలో ప్రతి ఎన్నికల్లోనూ మోదీ కేంద్ర బిందువుగా ఉంటున్నారు. కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లిన ఏడేళ్ల తర్వాత కూడా గుజరాత్‌ రాజకీయాలు మోదీ చూట్టే తిరగుతున్నాయని మరోసారి వెల్లడైంది. ఇప్పటికైనా కాంగ్రెస్ మోదీపై వ్యతిరేక ప్రచారాన్ని మానుకొని, స్థానిక సమస్యలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లాలని.. ఆయన గెలుపు పాఠాలను అనుసరించాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:

అగ్ర కథనాలు