ఆపరేషన్ కమలం: టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలపై బీజేపీ కన్ను

వివిధ కారణాలతో వారిలో 20 మందికి పైగా అభ్యర్థులను మార్చే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే వారిలో కొంతమందైనా పార్టీ మారే అవకాశం ఉంది.

news18-telugu
Updated: October 3, 2018, 6:31 PM IST
ఆపరేషన్ కమలం: టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలపై బీజేపీ కన్ను
మహబూబ్‌నగర్ సభలో డ్రమ్స్ మోగిస్తున్న అమిత్ షా (File)
  • Share this:
తెలంగాణలో ఆపరేషన్ కమలంను బీజేపీ ప్రారంభించింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో అసంతృప్త నేతలకు వల వేసే పనిలో పడింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈనెల 10న తెలంగాణలో పర్యటించనున్నారు. కరీంనగర్‌లో జరిగే బహిరంగసభలో ఆయన పాల్గొంటారు. సెప్టెంబర్ 15న మహబూబ్ నగర్ నుంచి తెలంగాణ ఎన్నికల శంఖారావాన్ని పూరించిన అమిత్ షా.. ఈసారి కరీంనగర్ వేదికగా కేడర్‌లో మరింత ఉత్తేజం తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి భారీ ఏర్పాట్లు చేసే పనిలో రాష్ట్ర పార్టీ నాయకులు నిమగ్నమయ్యారు. అదే రోజు పార్టీ ముఖ్యనేతలతో కూడా అమిత్ షా ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల మీద మరింత కూలంకషంగా చర్చించనున్నారు. అభ్యర్థుల గురించి కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది.

తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని బీజేపీ ప్రకటించింది. అయితే, అందుకు తగ్గట్టుగా అభ్యర్థులను వెతుక్కునే పనిలో పడింది. సొంతంగా కొద్దోగొప్పో కేడర్‌ ఉన్నా... 119 నియోజకవర్గాల్లో బలమైన నాయకులు బీజేపీకి లేరనే మాట కమలనాధులే ఒప్పుకొనే వాస్తవం. అందుకే కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల్లోని అసంతృప్తుల మీద కన్నేస్తోంది. కేసీఆర్ ఇప్పటికే 105 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. కానీ, వారందరికీ టికెట్ వస్తుందన్న గ్యారెంటీ చివరి నిమిషం వరకు లేదంటూ ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ నిర్వహించే అంతర్గత సర్వేలు, వివిధ కారణాలతో వారిలో 20 మందికి పైగా అభ్యర్థులను మార్చే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే వారిలో కొంతమందైనా పార్టీ మారే అవకాశం ఉంది. ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న అలాంటి నేతలను తమ వైపు తిప్పుకోవాలని బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే ఆందోల్ ఎమ్మెల్యేగా పనిచేసిన బాబూ మోహన్ టీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఇలాంటి వారు ఇంకా కొందరు ఉన్నారని బీజేపీ అంచనా వేస్తోంది. స్టేషన్‌ఘన్‌పూర్‌లో రాజయ్యను మార్చి.. అక్కడ కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వాలని కేడర్ డిమాండ్ చేస్తోంది. రాజయ్యకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు కూడా జరుగుతున్నాయి. ఒకవేళ చివరి నిమిషంలో సమీకరణాలు మారి.. కడియంను స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి బరిలో దింపాల్సి వస్తే.. రాజయ్య పార్టీ మారతారని భావిస్తున్నారు. అలాంటి నేతలను తమవైపునకు తిప్పుకొని టికెట్ ఇస్తే బావుంటుందని కమలనాధులు భావిస్తున్నారు.


టీఆర్ఎస్ పార్టీనే కాకుండా కాంగ్రెస్ పార్టీలో కూడా ఆశావహులు చాలా మంది ఉన్నారు. కూటమి పొత్తుల్లో భాగంగా ఒకవేళ ఆయా నియోజకవర్గాల్లో టికెట్లు ఇతర పార్టీలకు కేటాయిస్తే.. అప్పటి వరకు నియోజకవర్గాల్లో పనిచేసిన హస్తం నేతల్లో అసంతృప్తి రాజేస్తుంది. అలాంటి వారి మీద కూడా బీజేపీ దృష్టిపెట్టింది. ఓ వైపు సొంత అభ్యర్థులను ఎంచుకుంటూనే మరోవైపు ఇతర పార్టీల నుంచి ఆపరేషన్ ఆకర్ష్‌ కూడా ప్రారంభిస్తోంది.

ఇవి కూడా చదవండి
Published by: Ashok Kumar Bonepalli
First published: October 3, 2018, 6:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading