నిర్భయ తల్లికి కాంగ్రెస్ ఆఫర్.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై పోటీ..?

నిర్భయ దోషుల ఉరిశిక్షకు సంబంధించి శుక్రవారం ఢిల్లీలోని పాటియాలా హౌజ్ కోర్టు డెత్ వారెంజ్ జారీ చేసింది. ఫిబ్రవరి 1 ఉదయం 6 గంటలకు ఉరి శిక్ష వేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది.


Updated: January 17, 2020, 5:37 PM IST
నిర్భయ తల్లికి కాంగ్రెస్ ఆఫర్.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై పోటీ..?
నిర్భయ తల్లి ఆశా దేవి
  • Share this:
నిర్భయ దోషులకు డెత్ వారెంట్ జారీ ఐన సమయంలోనే.. ఢిల్లీ రాజకీయాలకు సంబంధించి ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నిర్భయ తల్లి ఆశాదేవి పోటీ చేస్తారని.. ఏకంగా సీఎం కేజ్రీవాల్‌పైనే ఆమె పోటీకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. ఆమెకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆఫర్ చేసిందనే పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ప్రచారంపై కాంగ్రెస్ నేత కీర్తి ఆజాద్ చేసిన స్పందించారు. ''అమ్మా నీకు వందనం.. ఆశా దేవి గారు మీకు స్వాగతం అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీనిపై ఢిల్లీ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ ప్రచారంపై మీడియా ప్రతినిధులు నేరుగా ఆశా దేవినే ప్రశ్నించారు. ఐతే తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని.. కాంగ్రెస్ పార్టీలో ఎవరితోనూ తాను మాట్లాడలేదని స్పష్టం చేశారు. దోషులకు ఉరిశిక్ష వేసి తన కూతురికి న్యాయం చేయాలని.. అంతకు మించి తనకు ఏమీ వద్దని తెలిపారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీలోని మొత్తం 70 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8 పోలింగ్ జరగనుండగా.. ఫిబ్రవరి 11న ఫలితాలు వెల్లడిస్తారు.

నిర్భయ దోషుల ఉరిశిక్షకు సంబంధించి శుక్రవారం ఢిల్లీలోని పాటియాలా హౌజ్ కోర్టు డెత్ వారెంజ్ జారీ చేసింది. ఫిబ్రవరి 1 ఉదయం 6 గంటలకు ఉరి శిక్ష వేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దోషులకు ఈ నెల 22న ఉరిశిక్ష వేయాలని కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ... వివిధ సాంకేతిక కారణాల వల్ల అది వాయిదా పడింది. నలుగురు దోషుల్లో ఒకడైన ముఖేశ్ కుమార్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించడంతో... వీరికి ఫిబ్రవరి 1న ఉరి శిక్ష వేయాలని నిర్ణయించారు.First published: January 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు