హిందీ విషయంలో దిగొచ్చిన కేంద్రం.. అమిత్ షా క్లారిటీ

అమిత్ షా వివరణ ఇవ్వడంతో.. తమిళనాడులో హిందీకి వ్యతిరేకంగా డీఎంకే తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని ఆ పార్టీ ప్రెసిడెంట్ స్టాలిన్ వాయిదా వేశారు.

news18-telugu
Updated: September 18, 2019, 8:12 PM IST
హిందీ విషయంలో దిగొచ్చిన కేంద్రం.. అమిత్ షా క్లారిటీ
అమిత్ షా
news18-telugu
Updated: September 18, 2019, 8:12 PM IST
దేశమంతా హిందీ భాష ఉండాలన్న ప్రతిపాదనపై దుమారం రేగింది. ఒకే దేశం-ఒకే భాష విధానాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని దక్షిణాది రాష్ట్రాలు భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఎట్టకేలకు దిగొచ్చింది. హిందీ భాషపై కేంద్రహోంమంత్రి అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. హిందీని కేవలం ద్వితీయ భాషగానే నేర్చుకోవాలని మాత్రమే తాను చెప్పానని..దీనిపై కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఏ భాషైనా మాతృభాష తర్వాతేనని స్పష్టం చేశారు. తన మాతృభాష కూడా హిందీ కాదన్నారు అమిత్ షా.

ప్రాంతీయ భాషలు కాకుండా హిందీ భాషే నేర్చుకోవాలని నేనెక్కడా చెప్పలేదు. మాతృభాష తర్వాత హిందీని ద్వితీయ భాషగానే నేర్చుకోవాలని మాత్రమే సూచించా. నేను కూడా హిందీ మాతృభాష కాని గుజరాత్ రాష్ట్రం నుంచి వచ్చా. దీనిపై కొందరు రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. అది వారి ఇష్టం.
అమిత్ షా, కేంద్ర హోంమంత్రి


హిందీ భాష ఒక్కటే దేశాన్ని ఏకం చేయగలదన్న అమిత్ షా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. కేంద్ర ప్రతిపాదనపై హిందీయేతర, దక్షిణాది రాష్ట్రాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. అంతేకాదు హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని చేపట్టాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో హిందీ భాష వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది కేంద్రం. అమిత్ షా వివరణ ఇవ్వడంతో.. తమిళనాడులో హిందీకి వ్యతిరేకంగా డీఎంకే తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని ఆ పార్టీ ప్రెసిడెంట్ స్టాలిన్ వాయిదా వేశారు. దక్షిణాదిపై హిందీని బలవంతంగా రుద్దడాన్ని తాము వ్యతిరేకిస్తామని స్పష్టంచేశారు.
First published: September 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...