ఒకే దేశం.. ఒకే భాష.. గాంధీ కలలను నిజం చేయాలి : అమిత్ షా

One Language One Nation : దేశమంతా హిందీని ప్రాథమిక భాషగా చేయాల్సిన అవసరం ఉందని.. యావత్ భారతానికి ఒకే భాష ప్రాతినిధ్యం ఉండాల్సిన అవసరం ఉందని ట్విట్టర్‌ ద్వారా చెప్పుకొచ్చారు.

news18-telugu
Updated: September 14, 2019, 11:08 AM IST
ఒకే దేశం.. ఒకే భాష.. గాంధీ కలలను నిజం చేయాలి : అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా (File Photo)
news18-telugu
Updated: September 14, 2019, 11:08 AM IST
హిందీ దివస్‌ను పురస్కరించుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. యావత్ భారతావనిని ఒక్క తాటి పైకి తీసుకురాగల సామర్థ్యం హిందీకి ఉందని నొక్కి చెప్పారు. దేశ ప్రజలకు హిందీ భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.భారతదేశంలో అనేక భాషలు ఉన్నా.. దేశానికి ఒక కామన్ లాంగ్వేజ్ ఉండాల్సిన అవసరం ఉందన్నారు.ఎక్కువ మంది మాట్లాడే హిందీ భాష దేశాన్ని ఐక్యంగా ఉంచడంలో దోహదపడుతుందన్నారు.దేశమంతా హిందీని ప్రాథమిక భాషగా చేయాల్సిన అవసరం ఉందని.. యావత్ భారతానికి ఒకే భాష ప్రాతినిధ్యం ఉండాల్సిన అవసరం ఉందని ట్విట్టర్‌ ద్వారా చెప్పుకొచ్చారు.

భారతదేశం అనేక భాషల సమూహం. ప్రతీ భాషకు తనదైన ప్రత్యేకత ఉంది. అయినప్పటికీ ప్రపంచం ముందు దేశ ఉనికిని చాటేందుకు భారత్ మొత్తానికి ఒకే భాష(కామన్ లాంగ్వేజ్) ప్రాతినిధ్యం అవసరం ఉంది. ఇప్పుడు దేశం మొత్తం ఒక్క తాటిపై ఉందంటే.. దానికి కారణం.. ఎక్కువమంది మాట్లాడే హిందీ భాష వల్లే.
అమిత్ షా, కేంద్ర హోంమంత్రి


భారతీయులంతా ఇప్పటినుంచి హిందీ మాట్లాడటంపై ఎక్కువ దృష్టి పెట్టాలని.. తద్వారా మహాత్మాగాంధీ,సర్దార్ పటేల్ కలలను నిజం చేయాలని మరో ట్వీట్‌లో అమిత్ షా విజ్ఞప్తి చేశారు.

First published: September 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...