• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • ONE MORE SHOCK FOR CONGRESS IN TELANGANA EX MINISTER SUNITHA LAXMA REDDY MAY JOIN BJP AK

బీజేపీలోకి మరో మాజీమంత్రి ? మెదక్ ఎంపీగా పోటీ ?

బీజేపీలోకి మరో మాజీమంత్రి ? మెదక్ ఎంపీగా పోటీ ?

కాంగ్రెస్ నాయకురాలు సునీతా లక్ష్మారెడ్డి

కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత, మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డితో బీజేపీ పెద్దలు సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. సునీతా లక్ష్మారెడ్డి పార్టీలో చేరితే మెదక్ ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించడంతో పాటు పార్టీలో ఆమెకు మంచి స్థానం కల్పిస్తామని బీజేపీ జాతీయ నేతలు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

  • Share this:
    తెలంగాణలోని సీనియర్ రాజకీయ నేతలను తమ పార్టీలో చేర్చుకుని లోక్ సభ బరిలోకి దింపాలని భావిస్తున్న బీజేపీ జాతీయ నాయకత్వం... ఇందుకోసం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీమంత్రి డీకే అరుణకు కాషాయ కండువా కప్పింది. మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా డీకే అరుణ బరిలో నిలవడం దాదాపు ఖాయమైంది. డీకే అరుణతో పాటు మరికొందరు సీనియర్ నేతలను తమ పార్టీలో చేర్చుకోవడంపై దృష్టి పెట్టిన కమలనాథులు... ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత, మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డితో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

    కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పని చేసిన సునీతా లక్ష్మారెడ్డి... గత అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే లోక్ సభ ఎన్నికల్లో సీనియర్లను బరిలోకి దింపడంతో... తనకు మెదక్ ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించాలని సునీతా లక్ష్మారెడ్డి కోరినట్టు సమాచారం. అయితే ఇందుకు నిరాకరించిన కాంగ్రెస్ హైకమాండ్... ఈ స్థానాన్ని గాలి అనిల్ కుమార్‌కు కేటాయించింది. దీంతో ఆమె కాంగ్రెస్‌ను వీడాలని నిర్ణయించుకున్నారని... ఇందుకోసం ఇప్పటికే బీజేపీ జాతీయ నేతలతో చర్చలు జరిపారని వార్తలు వినిపిస్తున్నాయి. సునీతా లక్ష్మారెడ్డి పార్టీలో చేరితే మెదక్ ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించడంతో పాటు పార్టీలో ఆమెకు మంచి స్థానం కల్పిస్తామని బీజేపీ జాతీయ నేతలు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. మొత్తానికి డీకే అరుణ బాటలోనే సునీతా లక్ష్మారెడ్డి కూడా పయనిస్తారా అన్నది ఒకటి రెండు రోజుల్లో తేలిపోనుంది.




    First published: