Telangana: బీజేపీకి మరో సీనియర్ నేత షాక్ ఇస్తారా ? అంతా కేసీఆర్ ప్లాన్ ?

బండి సంజయ్, కేసీఆర్ (ఫైల్ ఫొటోలు)

Telangana: టీఆర్ఎస్‌లో చేరిన ఈ సీనియర్ నేతలకు కేసీఆర్ ఏ రకంగా ప్రాధాన్యత ఇస్తారనే అంశం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

 • Share this:
  తెలంగాణలోని కొందరు సీనియర్ రాజకీయ నేతలు బీజేపీలో చేరడంలో ఆ పార్టీ బలోపేతం అవుతుందని చాలామంది భావించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అనే సంకేతాలు రావడంతో.. చాలామంది నేతలు బీజేపీ వైపు చూశారు. అలా బీజేపీ వైపు వెళ్లిన నాయకుల్లో టీడీపీలో పని చేసిన సీనియర్ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, పెద్దిరెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి ఉన్నారు. బీజేపీలో చేరిన ఈ నేతలు టీఆర్ఎస్‌పై రాజకీయ దాడి చేస్తారని అంతా అనుకున్నారు. కానీ వీరంతా బీజేపీ తరపున పెద్దగా గళం వినిపించలేదు.

  ఇటీవల మోత్కుపల్లి నర్సింహులు, పెద్దిరెడ్డి బీజేపీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ గూటికి చేరుకుంటున్నట్టు సంకేతాలు ఇచ్చారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ టీఆర్ఎస్‌లో చేరిన కొద్దిరోజులకే వీరు కూడా టీఆర్ఎస్ వైపు అడుగులు వేశారు. దీంతో బీజేపీలో కొనసాగుతున్న సీనియర్ నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి కూడా వీరి బాటలోనే పయనిస్తారనే చర్చ జరుగుతోంది. గతంలో తెలంగాణ టీడీపీలో కీలక పాత్ర పోషించిన రేవూరి ప్రకాశ్ రెడ్డి.. ఆ తరువాత బీజేపీలో చేరారు.

  అయితే మోత్కుపల్లి, పెద్దిరెడ్డి తరహాలోనే ఆయన కమలం పార్టీలో సైలెంట్‌గా ఉంటూ వచ్చారు. దీంతో ఆయన కూడా టీఆర్ఎస్‌లో చేరొచ్చనే చర్చ జరుగుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందే బీజేపీని బలహీనపరిచే వ్యూహంలో భాగంగా ఆ పార్టీ నుంచి టీఆర్ఎస్‌లోకి వలసలను ప్రొత్సహిస్తోందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే టీఆర్ఎస్‌లో చేరిన ఈ సీనియర్ నేతలకు కేసీఆర్ ఏ రకంగా ప్రాధాన్యత ఇస్తారనే అంశం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
  Published by:Kishore Akkaladevi
  First published: