Home /News /politics /

ONE MAN DIRECTING PEOPLE TO ELECTING SUITABLE PERSON AS A SARPANCH FOR 33 YEARS IN A VILLAGE OF EAST GODAWARI DISTRICT HERE ARE THE DETAILS PRN

AP Panchayat Elections: ఆ గ్రామంలో 33 ఏళ్లుగా ఆయన చెప్పిందే వేదం... నిలబెట్టిన వారే సర్పంచ్...

సలాది వెంకట్రావు (ఫైల్)

సలాది వెంకట్రావు (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రస్తుతం పంచాయతీ (AP Panchayat Elections) ఎన్నికల హడావిడి నడుస్తోంది. ఏకగ్రీవాల కోసం, విజయాల కోసం పార్టీలు, వారు మద్దతిచ్చిన అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు.

  ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల హడావిడి నడుస్తోంది. ఏకగ్రీవాల కోసం, విజయాల కోసం పార్టీలు, వారు మద్దతిచ్చిన అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. సర్పంచిగా ఒక్కసారి గెలవడానికే ఆపసోపాలు పడిపోయే కాలం ఇది. పంచాయతీని బట్టి ఎన్నికల ఖర్చు లక్షలు కోట్ల రూపాయలు దాటి పోతున్నాయి. అలాంటిది ఓటర్లకు వాటర్ ప్యాకెట్ కూడా ఇవ్వకుండా వరుసగా ఆరు ఎన్నికలలో అంటే ముపైమూడేళ్లుగా ఆ నాయకుడు చెప్పిన వాళ్లకే ఓట్లు వేస్తున్నారు తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారం ప్రజలు.  అలాగని అదేదో వెయ్యో పదిహేను వందల ఓట్లున్న చిన్న గ్రామం కాదండోయ్. మొత్తం ఓటర్లు 5,563 మంది.  ప్రతి ఎన్నికలలో అయిదు వందల ఓట్లు తగ్గకుండా మెజారిటీ.

  ఆయన నిలబెట్టిన వారే సర్పంచ్
  ఆయన పేరు సలాది వెంకట్రావు. అందరూ వెంకన్న అంటారు. 1988లో సర్పంచిగా తొలిసారి పోటీ చేసి 864 ఓట్లు మెజారిటీతో విజయం సాధించారు. అధ్వానంగా ఉండే ఊరిని బాగు చెయ్యడంలో విశేష కృషి చేసారు. 1995 ఎన్నికలలో సర్పంచ్ పదవి బిసి మహిళకు కేటాయించారు. అప్పుడు కుడిపూడి శారదను వెంకట్రావు పోటీలో నిలపగా 1347 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2001లో ఒసి జనరల్ కావడంతో ఆయనే పోటీ చేసి 1046 ఓట్లు మెజారిటీతో విజయం సాధించారు. 2006లో బిసి జనరల్ అయ్యింది ఇళ్ల శేషాద్రి శ్రీనివాస్ ని పోటీలో నిలిపి 678 ఓట్లు మెజారిటీతో గెలిపించారు. 2013లో ఎస్సీ జనరల్ అయ్యింది. అయితే ఎంతో నమ్మకంగా ఉండే పంచాయతీలో పారిశుధ్య కార్మికరాలు యర్రంశెట్టి వెంకాయమ్మను పోటీలో నిలిపి 1310 ఓట్లు మెజారిటీతో గెలిపించారు. ఇప్పుడు కూడా ఎస్సీ లకే రిజర్వ్ అయ్యింది. ఈసారి ఎమ్ఎ చదివిన లంక వర ప్రసాద్ ను పోటీలో నిలిపారు. నామినేషన్లుకు రెండు రోజుల ముందు ప్రసాద్ ను పిలిచి పోటీ చేయాలని వెంకట్రావు ప్రతిపాదించారు. మొత్తం అయిదుగురు పోటీలో ఉండగా జనసేన అభ్యర్థిగా వెంకట్రావు పోటీచేయించిన ప్రసాద్ 776 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

  ఇది చదవండి: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ సంచలన ఆదేశాలు  ఓట్లు అడగడాలుండవ్...
  వెంకట్రావు ఎన్నికల ప్రచారం చాలా విచిత్రంగా ఉంటుంది. బలపర్చిన అభ్యర్థి దండం పెట్టుకుని నడుస్తుంటే పక్కన చేతులు వెనక్కి పెట్టి వెంకట్రావు ఓట్లు అడిగేతీరు ఆశ్చర్యం కల్పిస్తుంది. “నేను ఇతన్ని పోటీలో నిలబెట్టాను...నామీద నమ్మకం ఉంటే ఓటు వెయ్యండి లేకపోతే మానేయండి..” అని మొహమాటం లేకుండా చెబుతాడు. ఏ ఓటరకు చేతులు జోడించి దణ్డం పెట్టరు. ప్రచారానికి కూడా ఎవరనీ పనులు మానుకుని రావద్దంటారు. అభ్యర్థితో పాటు ఈయన ఒక్కరే తిరుగుతారు. ఓటర్లకు ఎలాంటి ప్రలోబాలు ఉండవు. ఎన్నికల గుర్తు తెలిడం కోసం డోర్ పోస్టర్స్ ముద్రిస్తారంతే. ఈ సారి తక్కువ సమయం ఉన్నందున మైకు పెట్టి ఆటోలో ప్రచారం చేశారు.  మొత్తం 14 వార్డులలో పది వార్డులు వెంకట్రావు   నిలబెట్టిన వారినే గెలిపించారు.

  ఇది చదవండి: ఓటుకు కిలో చికెన్, 30 గుడ్లు.. పీక్స్ కి చేరిన పంచాయతీ ప్రచారం  తిట్టుకున్నా.. ఓట్లేస్తారు...
  మూలస్థాన అగ్రహారం వెళ్ళి వెంకన్న ఎలాంటోడని అడిగితే పిచ్చొడండి బాబూ..అని తిట్టుకుంటారు. ఎందుకంటే ఎవరికీ అనుకూలంగా చేయరు. తను చెయ్యాలనుకున్నదనే  చేస్తారు. అందరికీ న్యాయం జరగాలంటారు. అందుకునే తిట్టుకున్న వాళ్లు కుడా ఓట్లేసి గెలిపిస్తారు. ఎన్టీఆర్ పై అభిమానంతో పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలోనే ఉన్నారు. అయితే ఇటీవల పార్టీలో ఎన్టీఆర్ ఆశయాలు సన్నగిల్లాయని పవన్ కళ్యాణ్ సిద్దాంతాలు నచ్చి జనసేన పార్టీలో చేరానని చెప్తారాయన. తన రాజకీయమంతా సైకిల్ పైనే సాగింది.  తెల్లవారుజామునే ఊరంతా తిరిగి  పారిశుద్ధ్యం, త్రాగు నీరు, వీధి లైట్లు వంటి సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తారు. రాజకీయంగా రూపాయి ఆశించరు. పావలా పెట్టరు. డబ్బు ఖర్చు పెట్టి గెలిస్తే వాటిని సంపాదించుకోవడానికి అడ్డదారులు తొక్కుతారంటారు వెంకట్రావు. అసలు సర్పంచ్ కు చెక్ పవర్ ఉండకూడదని వాదిస్తారు. అంతేకాదు రెండున్నర ఏళ్ల తర్వాత సర్పంచ్ పాలన ప్రజలకు నచ్చకపోతే రీకాల్ ద్వారా తొలగించే చట్టం తీసుకు రావాలని డిమాండ్ చేస్తారు.ప్రస్తుత రోజుల్లో ఇటువంటి నాయకులు అత్యంత అరుదుగానే ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap local body elections, AP Politics, East Godavari Dist, Gram Panchayat Elections, Janasena, Janasena party, Local body elections

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు