Andhra Pradesh: పవన్ ను కలిసినందుకు వేధింపులా..? అందుకే పదవికి రాజీనామా చేశానన్న శివశ్రీ

పవన్ కలిస్తే వేధింపులా..?

విపక్ష నేతను కలిసినందుకే తనపై వేధింపులకు దిగుతున్నారని.. స్థానిక నేతల ఒత్తిడితో రెండు రోజుల పాటు పోలీసు స్టేషన్ కు తిప్పారని.. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే అని ఓ యువతి నిలుస్తోంది. ఇంతకీ ఈ కేసులో వాస్తవం ఏంటి..?

  • Share this:
    ఏపీలో వేధింపుల పర్వంపై విమర్శలు పెరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విపక్ష నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని.. రాజకీయంగా కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే కొందరు న్యాయస్థానాలను కూడా ఆశ్రయించారు. తాజాగా మరో ఘటన ఏపీలో కలకలం రేపుతోంది. రాష్ట్రంలో విపక్ష నేతలను కలిసి గోడు వెళ్లబోసుకుంటే తప్పుగా చిత్రీకరిస్తున్నారని.. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధింపులకు గురిచేస్తున్నారని.. తాడేపల్లిగూడెంలో సీఎం జగన్ నివాసానికి సమీపంలో ఉన్న అమరారెడ్డి నగర్‌ వాసులు మండి పడుతున్నారు. స్థానిక శివశ్రీ అనే యువతిని పోలీసులు వేధింపుకుల గురి చేస్తున్నారని ఆమె తల్లి, బంధువులు ఆరోపిస్తున్నారు. బలవంతంగా తమ ఇళ్లను ఖాళీ చేయించాలని చూస్తూ.. అన్యాయం చేస్తున్న వారిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆమె గత వారం ఫిర్యాదు చేసింది. దీంతో వైసీపీ నేతలు ఆమెపై కక్ష గట్టి... పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని కుటుంబ సభ్యులు ఆవేధన వ్యక్తం చేశారు..

    ఇప్పటికే రెండు సార్లు స్టేషన్‌కు పిలిపించారని.. రెండురోజుల క్రితం సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు యువతని పోలీస్ స్టేషన్‌లో వేచి ఉండేలా చేశారన్నారు. పవన్ కల్యాణ్ ముందు మేకా రామిరెడ్డి పేరు చెప్పినందుకు టార్చర్ చేస్తున్నారన్నారు. ఇంటి గురించి అడిగితే పవన్ కల్యాణ్‌ను అడుక్కో.. లోకేశ్‌ను అడుక్కో అంటూ అవహేళనకు గురిచేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం తనకు ప్రభుత్వ ఇల్లు రాలేదని.. న్యాయం చేయాలంటూ పవన్ ను కలిసి నుందుకు ఇలా వేధింపులకు దిగుతున్నారని.. వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, స్థానికుల తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ పార్టీలు సైతం శివశ్రీకి మద్దతు ఇస్తున్నారు.

    నలువైపులా ఒత్తిడి పెరగడం.. మీడియా.. సోషల్ మీడియా ద్వారా విషయం బయటకు రావడంతో ఎట్టకేలకు తనను పోలీసులు విడిచిపెట్టారు అంటోంది శివశ్రీ. తాడేపల్లి పోలీస్‌స్టేషన్ నుంచి విడుదలైన తరువాత ఆమె మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ ప్రభుత్వంలో అవినీతి చూడలేకే ఉద్యోగానికి రాజీనామా చేశానన్నారు. నిర్వాసితులకు న్యాయం కోసం జనసేనాని పవన్‌ని కలిస్తే...పోలీసులు బెదిరించారని చెప్పారు. జగన్‌ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని శివశ్రీ మండిపడ్డారు.

    తనకు ప్రభుత్వ ఇంటి స్థలం రాలేదని.. న్యాయం చేయాలంటూ పవన్ కల్యాణ్​ను కలిసి విజ్ఞప్తి చేశానని.. కానీ ఆయనను ఎందుకు కలిశావంటూ.. స్థానికంగా ఉన్న పార్టీ యువకులతో కలిసి పోలీసులు తనను బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎలాంటి కారణం లేకపవడంతో ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడించేందుకు యత్నిస్తున్నారని అక్రమ కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. తనకు పోలీసుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అకారణంగా గొడవ చేస్తే ..కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారని కన్నీరు పెట్టుకున్నారు.
    Published by:Nagesh Paina
    First published: