నేడు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 49వ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్ గాంధీ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. పుట్టినరోజు సందర్భంగా రాహుల్.. పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలను కలిశారు. శుభాకాంక్షలు తెలిపిన నేతలు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలిపారు.రాహుల్ పుట్టినరోజు నేపథ్యంలో సోషల్ మీడియాలో #IAmRahulGandhi #HappyBirthdayRahulGandhi పేర్లతో హాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. రాహుల్ పొలిటికల్ కెరీర్లో ఐదు బెస్ట్ మూమెంట్స్‌ను కాంగ్రెస్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.
ఇదిలా ఉంటే, ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే.కేవలం 52 ఎంపీ స్థానాలను మాత్రమే ఆ పార్టీ గెలుచుకోగలిగింది.ఆఖరికి రాహుల్ పోటీ చేసిన అమేథీలోనూ పార్టీ ఓటమిపాలవడం గమనార్హం.ఈ నేపథ్యంలోనే పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు రాహుల్ గాంధీ సిద్దపడినట్టుగా కథనాలు వచ్చాయి.అయితే రాహుల్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవద్దని పార్టీ నేతల నుంచి ఒత్తిడి ఎక్కువవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికైతే ఆయన రాజీనామాపై అధికారికంగా ఎలాంటి సమాచారం బయటకు రాలేదు.
Published by:Srinivas Mittapalli
First published:June 19, 2019, 11:41 IST