'ఓ మై గాడ్..నమ్మలేకపోతున్నా..!' 28 ఏళ్ల యువకుడికి కీలక ఎంపీ సీటు

‘సగటు భారతీయుడి దేశభక్తికి ఈ ఎన్నికలు ఒక టెస్ట్ లాంటివి. మీరు మోదీకి ఓటేస్తే దేశభక్తులు. లేకపోతే మీరు దేశవిరోధులు.’ అని బెంగళూరు దక్షిణ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి తేజస్వి సూర్య చేసిన కామెంట్స్‌పై దుమారం రేగింది.

OMG OMG!!! I can't believe this..అని పోస్ట్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బీజేపీ అభిమానులు, నేతలు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. నిబద్ధతతో పనిచేసే ప్రతికార్యకర్తకూ బీజేపీలో గుర్తింపు ఉంటుందని ప్రశంసలు గుప్పిస్తున్నారు.

 • Share this:
  తేజస్వి సూర్య..! బెంగళూరులో ఇప్పుడీ పేరు మార్మోగిపోతోంది. 28 ఏళ్ల ఈ యువకుడు వృత్తిరీత్యా న్యాయవాదిగా పనిచేస్తున్నారు. బెంగళూరు నగరంలో బీజేపీ యువమోర్చాకు ఉపాధ్యక్షుడుగా ఉన్నారు. హిందూత్వ నినాదంతో క్రియాశీలంగా పనిచేస్తున్న ఈ యువకుడికి బీజేపీ హైకమాండ్ పెద్ద బాధ్యతనే అప్పజెప్పింది. కీలకమైన బెంగళూరు సౌత్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపింది. దాంతో ఈ యువనేతపై కన్నడ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అసలు ఎవరీయనంటూ ప్రత్యర్థి పార్టీల నేతలు ఆరాతీస్తున్నారు.

  బీజేపీ దివంగత నేత, మాజీ కేంద్రమంత్రి అనంత కుమార్‌ బెంగళూరు సౌత్ నుంచి వరసగా ఆరు సార్లు విజయం సాధించారు. 1996 నుంచి 2018 వరకు ఆయనే ఎంపీగా ఉన్నారు. ఐతే అనారోగ్య కారణాలతో గత ఏడాది డిసెంబరులో అనంత్ కుమార్ మరణించారు. దాంతో ఆయన స్థానంలో ఎవరిని దింపాలన్న విషయంపై బీజేపీ పెద్దలు పలుమార్లు చర్చలు జరిపారు. అనంత్ కుమార్ సతీమణి తేజస్వినికే టికెట్ ఇస్తారని అందరూ భావించారు. కానీ బీజేపీ అనూహ్యంగా తేజస్వి సూర్యను తెరపైకి తెచ్చింది.

  బెంగళూరు సౌత్ స్థానంలో తనకు టికెట్ ఇచ్చారన్న విషయం తెలిసి తేజస్విసూర్య ఆశ్చర్యం వ్యక్తంచేశారు. బీజేపీ అదిష్టానం నిర్ణయాన్ని నమ్మలేకపోతున్నానంటూ ట్విటర్ వేదికగా ఆనందాన్ని పంచుకున్నారు.
  నేను ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నా. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ ప్రధాని, అతిపెద్ద రాజకీయ పార్టీ అధ్యక్షుడు 28 ఏళ్ల యువకుడిపై విశ్వాసముంచారు. ప్రతిష్టాత్మకమైన బెంగళూరు సౌత్ నుంచి బరిలోకి దింపుతున్నారు. బీజేపీలో మాత్రమే ఇటువంటివి జరుగుతాయి. వినమ్రతతో, సంతోషంతో ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నా. మాతృభూమి కోసం నా చివరి శ్వాస వదిలేవరకు పనిచేస్తా. ఈ విధంగా మాత్రమే రుణం తీర్చుకోగలను.
  తేజస్వి సూర్య


  OMG OMG!!! I can't believe this..అని పోస్ట్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బీజేపీ అభిమానులు, నేతలు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. నిబద్ధతతో పనిచేసే ప్రతికార్యకర్తకూ బీజేపీలో గుర్తింపు ఉంటుందని ప్రశంసలు గుప్పిస్తున్నారు.  ఒకవేళ తేజస్వి సూర్య ఎంపీగా గెలిస్తే యువ ఎంపీల జాబితాలో చేరిపోతారు. ఐతే ఆయన మాత్రం అత్యంత పిన్నవయసు గల ఎంపీ మాత్రం కాబోరు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీ ఎంపీ దుశ్యంత్ చౌతలా పిన్నవయసుగల ఎంపీగా రికార్డులకెక్కారు. 26 ఏళ్ల వయసులోనే ఆయన ఎంపీ అయ్యారు. 2014లో హిసార్ లోక్‌స్థానం నుంచి దుశ్యంత్ విజయం సాధించారు. హిసార్‌లో హర్యానా జనహిత్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ కుల్దీప్ సింగ్‌ను ఆయన ఓడించడం అప్పట్లో సంచలనం సృష్టించింది.
  First published: