Home /News /politics /

ODISHA CHIEF MINISTER NAVEEN PATNAIK DECLARES HIS ASSETS SU GH

Naveen Patnaik: ఆస్తుల వివరాలు ప్రకటించిన సీఎం నవీన్ పట్నాయక్.. ఏడాది కాలంలో ఆస్తులు ఎంత పెరిగాయంటే..

నవీన్ పట్నాయక్(ఫైల్ పొటో)

నవీన్ పట్నాయక్(ఫైల్ పొటో)

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్(Naveen Patnaik) తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. తన ఆస్తుల్లో చాలా వరకు పూర్వీకుల ద్వారా చ్చినవేనని ఆయన తెలిపారు.

తన స్థిర, చర ఆస్తులు అన్నీ కలిపి 2020, మార్చి 31కి 64.98 కోట్లుగా ఉన్నట్టు ఒడిశా (Odisha) సీఎం నవీన్ పట్నాయక్ నవీన్ పట్నాయక్ వివరించారు. దీంతో గత ఏడాదితో పోల్చితే తన ఆస్తి 71 లక్షలు పెరిగినట్టు వెల్లడించారు. నవీన్ పట్నాయక్ ఆదివారం తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. భువనేశ్వర్, ఢిల్లీ, ఫరీదాబాద్ లలో తన తండ్రి, మాజీ సీఎం బిజు పట్నాయక్ (Biju Patnaik), తల్లి జ్ఞాన పట్నాయక్ ల ద్వారా లభించిన ఆస్తులు, రచయితగా తాను రచించిన పుస్తకాల ద్వారా వచ్చిన రాయల్టీ విలువ అంతా కలిపి 63 కోట్ల రూపాయలను తన ఆస్తులుగా నవీన్ వెల్లడించారు. లోకాయుక్తకు ఈమేరకు సీఎం నవీన్ వివరాలు అందజేయనున్నారు. తనతోపాటు తన మంత్రివర్గంలోని కొందరు మంత్రుల ఆస్తుల వివరాలను కూడా నవీన్ వెల్లడించారు. ఆస్తుల్లో చాలావరకు పూర్వికుల ద్వారా తనకు వచ్చినట్టు ఆయన తెలిపారు.

బ్రహ్మచారి..
వివాహం చేసుకోకుండా బ్రహ్మచారిగానే జీవితం గడుపుతున్న నవీన్ తన జీవితంలో ఎక్కువ కాలం విదేశాల్లోనే గడిపారు. నిజాయితీ పరులైన సీఎంల జాబితాల్లో నవీన్ పేరు ముందువరుసలో నిలుస్తుంది. ఫరీదాబాద్ లోని ఉండగా టిక్రీ ఖేరా గ్రామంలో 22.7 ఎకరాల వ్యవసాయ భూమిలో ఇల్లు కూడా ఉంది. దీని విలువ 10 కోట్ల పైమాటే అంటూ సీఎం వివరించారు. న్యూ ఢిల్లీలోని ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులోని తన తల్లి నివాసంలో సగం వాటా ఈయనకు ఉండగా, దాని విలువ 43 కోట్ల పైమాటే. ఇక భువనేశ్వర్ ఎయిర్ పోర్ట్ సమీపంలోని నవీన్ వివాస్ లో 2/3వ వంతు వాటా ఉండగా ప్రస్తుతం దాని విలువ 9,52,46,190 రూపాయలుగా ఉంది. ఈ నివాసం కూడా ఆయనకు తన తల్లి ద్వారా వారసత్వంగా సంక్రమించిందే. బిజూ జనతా దళ్ (BJD) అనే ప్రాంతీయ పార్టీకి నేతృత్వంవహిస్తున్న నవీన్ 5సార్లు సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించి రికార్డు సృష్టించారు. ఇక పట్నాయక్ కేబినెట్ లో ప్రస్తుతం క్రీడాశాఖా మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న తుషార్ క్రాతి బెహెరా కేవలం 32.33 లక్షలు మాత్రమే తన యావద్ ఆస్తిగా ప్రకటించి, నవీన్ కేబినెట్ లో పేద మంత్రిగా నిలిచారు.

తిరుగులేని నేత
2000వ సంవత్సరం నుంచి ఒడిషా రాజకీయాల్లో తిరుగులేకుండా ఎదిగిన నవీన్ మిస్టర్ క్లీన్ ఇమేజ్ ను సంపాదించుకున్నారు. దీంతోపాటు ఒడిషా కేబినెట్ లోనే అత్యంత ధనవంతుడిగా కూడా ఈయన నిలవటం విశేషం. రాజకీయాల్లో, ప్రజాజీవితంలో అందరూ పారదర్శకతను పాటించాలంటూ పిలుపునిచ్చిన నవీన్.. ఇందులో భాగంగా ముందు తానే స్వయంగా దీన్ని ఏటా ఆచరించి చూపుతున్నారు. ఒడిషా లెజెండరీ నేతగా పేరుగాంచిన బిజూ పట్నాయక్ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన బిజూ గత రెండు దశాబ్దాలుగా సీఎంగా కొనసాగుతూ ఒడిషాకు అత్యధికకాలం ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తున్నారు.
Published by:Sumanth Kanukula
First published:

Tags: BJD, Naveen Patnaik, Odisha

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు