రాహుల్ అస్త్రం ఏటా రూ. 72,000 పథకం... ఒక పెద్ద స్కామ్...పీయూష్ గోయల్ ఎద్దేవా...

న్యాయ్ పథకం అమలులో టెక్నికల్ గా చాలా ఇబ్బందులు తలెత్తుతాయని, ముఖ్యంగా అర్హులను గుర్తించే క్రమంలో అవినీతి జరిగే అవకాశం ఉందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ హెచ్చరించారు.

news18-telugu
Updated: April 14, 2019, 8:20 PM IST
రాహుల్ అస్త్రం ఏటా రూ. 72,000 పథకం... ఒక పెద్ద స్కామ్...పీయూష్ గోయల్ ఎద్దేవా...
పీయూష్ గోయల్ (ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: April 14, 2019, 8:20 PM IST
కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టోలో ప్రకటించిన న్యాయ్ (కనీస ఆదాయ పథకం) మరో కుంభకోణానికి నాంది అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా ఎన్నోసార్లు పెద్ద పెద్ద వాగ్దానాలు చేసి వాటిని సాకారం చేయకుండానే మధ్యలో వదిలేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పెద్దలకు న్యాయ్ పథకం ఎలా అమలు చేయాలి అనేదానిపై కనీస అవగాహన కూడా లేదని ఎద్దేవా చేశారు. అంతేకాదు అసలు దేశంలో ఎంతమంది పేదలున్నారు, వారి స్థితిగతులేంటి, ఎంతమంది అర్హులున్నారు. అనే అంశాలపై కసరత్తు లేకుండానే న్యాయ్ పథకాన్ని ప్రవేశపెట్టారని, అయితే కనీస ఆదాయ పథకం త్వరలోనే ఒక గాలిబుడగలా పేలిపోతుందని పీయూష్ విమర్శించారు.

అలాగే న్యాయ్ పథకం అమలులో టెక్నికల్ గా చాలా ఇబ్బందులు తలెత్తుతాయని, ముఖ్యంగా అర్హులను గుర్తించే క్రమంలో అవినీతి జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. అయితే గడిచిన మూడుతరాలుగా కాంగ్రెస్ పార్టీ ఈ తరహా వాగ్దానాలతో అందరినీ మోసం చేస్తోందని విమర్శించారు. ఎన్డీఏ పనితీరు బాగున్నందుకే...ప్రస్తుతం దేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా దూసుకెళ్తున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉందని అన్నారు.

First published: April 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...