నేర మనస్తత్వాన్ని మార్చాలంటే.. గో సేవే మార్గం : మోహన్ భగవత్

గోసేవ ద్వారా నేరపూరిత ఆలోచనలను తగ్గించవచ్చన్నారు.జైల్లో ఉన్న ఖైదీలతో గో సేవ చేయిస్తే.. వారి నేర పరివర్తనలో మార్పు వస్తుందన్నారు.

news18-telugu
Updated: December 8, 2019, 3:35 PM IST
నేర మనస్తత్వాన్ని మార్చాలంటే.. గో సేవే మార్గం : మోహన్ భగవత్
మోహన్ భగవత్(File Photos)
  • Share this:
దేశంలో మహిళలపై పెరిగిపోతున్న అఘాయిత్యాలపై తీవ్ర చర్చ జరుగుతున్నవేళ.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గోసేవ ద్వారా నేరపూరిత ఆలోచనలను తగ్గించవచ్చన్నారు.జైల్లో ఉన్న ఖైదీలతో గో సేవ చేయిస్తే.. వారి నేర పరివర్తనలో మార్పు వస్తుందన్నారు. 'ఆవు ఈ విశ్వానికి తల్లి లాంటిది. అది పశు పక్షాదులను,సమస్త జంతు జాలాన్ని పోషిస్తుంది. మనుషులను వ్యాధుల బారి నుంచి కాపాడుతుంది. అలాగే మనుషుల మనస్తత్వాన్ని పూవుల లాగా స్వచ్చంగా మారుస్తుంది.' అని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని పుణేలో గోవిజ్ఞాన్ సంశోధన్ సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మోహన్ భగవత్ మాట్లాడారు.

జైళ్లలో గోశాలలను ఏర్పాటు చేసి.. వాటి పెంపకాన్ని ఖైదీలకు అప్పగిస్తే.. వారి నేరపూరిత స్వభావంలో మార్పు వచ్చినట్టు కొంతమంది అధికారులు గుర్తించారు. కొంతమంది జైలు అధికారులు కూడా ఈ విషయాన్ని నాతో పంచుకున్నారు. కాబట్టి ఖైదీలతో గో సేవ చేయించడం ద్వారా వారి నేరపూరిత మనస్తత్వాన్ని మార్చవచ్చు.
మోహన్ భగవత్,ఆర్ఎస్ఎస్ చీఫ్
Published by: Srinivas Mittapalli
First published: December 8, 2019, 3:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading