ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా రిలీజ్ అయింది. కథానాయకుడు మూవీలో ఫుల్ లెన్త్ సినిమా ఎపిసోడ్ చూపించిన దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, హీరో బాలకృష్ణ... ఈ మూవీలో మొత్తం పొలిటిక్స్‌తో నింపేశారు. నాదెండ్ల భాస్కర్‌రావు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి సీఎం పీఠం లాక్కున్నారనీ... దాన్ని మళ్లీ కైవసం చేసుకోవడానికి ఎన్టీఆర్ ఎలాంటి ప్రయత్నాలు చేశారు? ఆ ప్రాసెస్‌లో చంద్రబాబు తెరవెనుక ఎలా చక్రం తిప్పారనే అంశాలను ఈ సినిమాలో హైలైట్ చేశారు. అయితే, ఈ మూవీలో నాదెండ్ల భాస్కర్‌రావును ప్రధాన విలన్‌గా చూపించిన చిత్ర యూనిట్.. కాంగ్రెస్ పార్టీని కూడా దోషిగా నిలబెట్టింది. ఇది కాంగ్రెస్ వర్గాలు ఏమాత్రం ఆశించని, ఆలోచించని అంశమనే చెప్పాలి.
కాంగ్రెస్ పార్టీ సహకారంతోనే నాదెండ్ల భాస్కర్‌రావు ఎమ్మెల్యేలను తనవైపుకి తప్పుకొని ముఖ్యమంత్రి అయ్యారని మహానాయకుడుని తెరకెక్కించారు. అందుకు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పూర్తి సహకారం అందించారనీ... అసలు ఎన్టీఆర్, టీడీపీని నాశనం చేసేందుకు ఇందిరాగాంధీనే నాదెండ్ల భాస్కర్‌రావుతో తిరుగుబాటు చేయించారని సినిమాలో ఎస్టాబ్లిష్ చేశారు. అదే సమయంలో ఎన్టీఆర్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాదెండ్ల భాస్కర్ రావును కాంగ్రెస్ పార్టీ కనీసం పట్టించుకోలేదని... ఆయన ఖర్మకు ఆయన్నే వదిలేసిందని చూపించారు.
నాదెండ్ల భాస్కర్ రావు ఒక్కరే కాదు... చంద్రబాబు మనసులో మాటను కూడా ఈ సినిమాలో చూపించాడు క్రిష్. కాంగ్రెస్ పార్టీ కోసం ఎంత కష్టపడినా తనను గుర్తించలేదని, ఎంత కష్టపడ్డా వృధానే అని చంద్రబాబు నిర్వేదం చెంది ఓ రకంగా చంద్రబాబు రాజకీయాలకు దూరమవుతారు. అయితే, ఎన్టీఆర్ మళ్లీ అల్లుడిని పిలిచినట్టుగా తెరకెక్కించారు.
కాంగ్రెస్,టీడీపీ మధ్య 30 ఏళ్ల వైరం ఉంది. అయితే, ప్రస్తుతం పరిస్థితులు మారాయి. ఇప్పుడు రెండు పార్టీలు దోస్తీ చేస్తున్నాయి. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఇలా చేసిందా అని మిలీనియల్ ఓటర్లకు తెలియజెప్పినట్టుగా మూవీ ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్, టీడీపీ దోస్తీ నేపథ్యంలో టీడీపీ నేతలు ఎలా సమర్థించుకుంటారు? కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
రోడ్డుపై పాక్ జెండా.. కసితీరా తొక్కుతున్న జనం
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chandrababu naidu, Congress, Indira Gandhi, NTR Biopic, NTR Mahanayakudu, NTR Mahanaykudu Movie Review, Rahul Gandhi, Tdp