NOW MAMATA BANERJEE BECOMES CHOICE FOR UPA CHAIRPERSON POST AFTER SHARAD PAWAR AK
Opinion: శరద్ పవార్ ఆశించిన స్థానంలో మమత బెనర్జీ.. కాంగ్రెస్ ఒప్పుకుంటుందా ?
మమతా బెనర్జీ (File)
యూపీఏ చైర్‌పర్సన్‌గా మమతను నియమించేందుకు సోనియాగాంధీ ఓకే చెబితే.. రాహుల్ గాంధీ మరోసారి ఏఐసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు లైన్ క్లియర్ అవుతుందని కాంగ్రెస్‌లో చర్చ జరుగుతోంది.
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన వెంటనే బీజేపీయేతర, ఎన్డీయేతర కూటమికి నాయకత్వం వహించేది ఎవరనే అంశంపై మరోసారి చర్చ మొదలైంది. ప్రస్తుతం యూపీఏ కూటమికి సోనియాగాంధీ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. అయితే కాంగ్రెస్‌లోని పలువురు కీలక నేతలు ఇటీవల సోనియా, రాహుల్ నాయకత్వంపై అనేక సందేహాలు లేవనెత్తారు. ఇదిలా ఉంటే ఈ విషయంలో మమతా బెనర్జీని ఒప్పించే విషయంలో ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్‌లోని జి-23 అసంతృప్తి నేతలను సోనియా నివాసానికి తీసుకొచ్చిన ఓ నేత ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నారని సమాచారం. గతంలో సంజయ్ గాంధీ హయాంలో మమతా బెనర్జీ ఇండియన్ యూత్ కాంగ్రెస్‌లో కీలక భూమిక పోషించేలా కూడా ఆయనే తెరవెనుక పాత్ర పోషించారు.
ఈ విషయంలో రాహుల్ గాంధీ సైతం టెన్ జనపథ్‌తో చర్చలు జరుపుతున్నారని.. యూపీఏ సారథ్యం వహించేలా మమతా బెనర్జీని ఆహ్వానించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.
ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ తరువాత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రాతినిథ్యం లేకుండా పోయిన రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ మారిపోయింది. ఈ విషయంలో కాంగ్రెస్ నాయకత్వం ఎలాంటి మేథోమథనాలు జరపడం లేదు.
యూపీఏ నాయకత్వం విషయంలో అసంతృప్తులకు పలు సందేహాలు ఉన్నాయి. కేవలం ఎన్నికల కోసం కాకుండా, దేశానికి సంబంధించి ప్రజా ఆరోగ్యం, భద్రత, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ప్రశ్నించే విషయంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సామర్థ్యంపై కూడా వాళ్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ విషయంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను చాలామంది నేతలు గౌరవిస్తారు. అయితే ప్రస్తుతం కరోనా పరిస్థితిని ఎదుర్కొనే విషయంలో బీజేపీ తీరు ఏ మాత్రం సరిగ్గా లేదని.. బెంగాల్ ఎన్నికలతో ఆ పార్టీ పరిస్థితి కూడా తేలిపోయిందనే చర్చ జరుగుతోంది. ఇలాంటి తరుణంలో 2024 నాటికి కాంగ్రెస్‌ను బలోపేతం చేసే చర్యలు చేపట్టాలని కొందరు కోరుతున్నారు.
యూపీఏ చైర్‌పర్సన్‌గా మమతను నియమించేందుకు సోనియాగాంధీ ఓకే చెబితే.. రాహుల్ గాంధీ మరోసారి ఏఐసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు లైన్ క్లియర్ అవుతుందని కాంగ్రెస్‌లో చర్చ జరుగుతోంది. ఈ రకంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ వ్యవహారాలపై ఎక్కువగా ఫోకస్ చేసేందుకు వీలు కలుగుతుందని.. ప్రియాంక గాంధీ ప్రచారంలో చురుగ్గా వ్యవహరిస్తారని కొందరు భావిస్తున్నారు.
2014 తరువాత నుంచి యూపీఏ తన ఉనికిని కోల్పోతోంది. 2004 ఎన్నికల తరువాత ఏర్పడిన యూపీఏ 2014 వరకు క్రియాశీలకంగా ఉంది. అయితే 2014, 2019 ఎన్నికల్లో వరుస ఓటములతో యూపీఏ డీలా పడిపోయింది. ఎప్పటికప్పుడు తమ భాగస్వామ్యపక్షాలతో యూపీఏ పెద్దలు చర్చలు కూడా జరపలేదు. ఎన్డీయేతర పార్టీలు బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, తమిళనాడు, బెంగాల్ ఎన్నికల సందర్భంగా కలిశాయి. కేరళ, తమిళనాడు, జమ్మూ కశ్మీర్లో కాంగ్రెస్‌కు భాగస్వామ్యపక్షాలు ఉన్నాయి.
గత లోక్‌సభ ఫలితాలు రావడానికి మూడు రోజుల ముందు (మే 20, 2019)న సోనియాగాంధీ ప్రతిపక్షాలతో సమావేశం ఏర్పాటు చేశారనే ప్రచారాన్ని డీఎంకే చీఫ్ స్టాలిన్ ఖండించారు. అలాంటి మీటింగ్ ఏమీ లేదని అన్నారు. యూపీఏ మీటింగ్ కేవలం ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన చర్చల కోసమే అని.. ప్రతిపక్షాలను ఒక చోట చేర్చేందుకు కాదని స్టాలిన్ తోసిపుచ్చారు.
ప్రతిపక్షాలన్నింటినీ ఒకేతాటిపైకి తీసుకురావాలనే ఆలోచన మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే యూపీఏ చైర్పర్సన్ కావాలని భావిస్తున్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా ఇక్కడ ఉన్నారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.