హోమ్ /వార్తలు /రాజకీయం /

దూసుకొస్తున్న కాంగ్రెస్, బీజేపీ...కేసీఆర్ వ్యూహాలు మారతాయా?

దూసుకొస్తున్న కాంగ్రెస్, బీజేపీ...కేసీఆర్ వ్యూహాలు మారతాయా?

కేసీఆర్ (File)

కేసీఆర్ (File)

తెలంగాణలో బీజేపీ అసలు తమకు పోటీ కాదనే భావనలో ఉన్న టీఆర్ఎస్‌కు లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో కమలనాథులు షాక్ ఇచ్చారు. టీఆర్ఎస్‌కు గట్టి పట్టున్న ఉత్తర తెలంగాణలోని అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ స్థానాలను మంచి మెజార్టీలో సొంతం చేసుకున్న బీజేపీ... టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.

ఇంకా చదవండి ...

  తనదైన రాజకీయ వ్యూహాలతో ప్రత్యర్థులను ఉక్కిరి బిక్కిరి చేయడంలో తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు పోటీ ఇచ్చే నాయకుడు రాష్ట్రంలో లేరనే చెప్పాలి. అయితే తెలంగాణలో ఇంతకాలం కాంగ్రెస్ టార్గెట్‌గానే కేసీఆర్ వ్యూహాలు ఉంటూ వచ్చాయి. జాతీయస్థాయిలో బలహీనపడుతూ వచ్చిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో మరింతగా బలహీనపడేలా కేసీఆర్ ఎప్పటికప్పుడు వ్యూహరచన చేస్తూ వచ్చారు. అందులో చాలావరకు సక్సెస్ సాధించారు కూడా. లోక్ సభ ఎన్నికలకు ముందు సైతం తెలంగాణలోని మెజార్టీ కాంగ్రెస్ సభ్యులను టీఆర్ఎస్‌లో చేర్చుకున్న గులాబీ బాస్... త్వరలోనే ఆ పార్టీ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్ శాసనసభాపక్షంలో విలీనం చేసుకునే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.


  అయితే ఇంతలోనే లోక్ సభ ఎన్నికలు జరగడం... కేంద్రంలో కాంగ్రెస్ సారథ్యంలోని ప్రభుత్వం ఏర్పడితే ఎలా అనే కారణంగా... ఈ ప్రక్రియకు టీఆర్ఎస్ టెంపరరీగా బ్రేకులు వేసింది. మళ్లీ ఈ ప్రక్రియను టీఆర్ఎస్ మొదలుపెడుతుందా లేదా అన్నది చూడాలి. ఇదంతా ఎలా ఉన్నా... తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత ఇప్పుడు కేవలం కాంగ్రెస్‌ లక్ష్యంగానే వ్యూహరచన చేస్తే సరిపోదని... ఆయనకు బీజేపీ నుంచి కూడా గట్టి పోటీ ఎదురుకానుందని లోక్ సభ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌తో పాటు బీజేపీ వ్యూహంగా తన భవిష్యత్ రాజకీయ వ్యూహాలు, ఎత్తులు అమలు చేయాల్సి ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.


  తెలంగాణలో బీజేపీ అసలు తమకు పోటీ కాదనే భావనలో ఉన్న టీఆర్ఎస్‌కు లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో కమలనాథులు షాక్ ఇచ్చారు. టీఆర్ఎస్‌కు గట్టి పట్టున్న ఉత్తర తెలంగాణలోని అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ స్థానాలను మంచి మెజార్టీలో సొంతం చేసుకున్న బీజేపీ... టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. దీంతో ఇక తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా పొలిటికల్ వార్ సాగనుందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌తో పాటు బీజేపీకి చెక్ పెట్టేందుకు కేసీఆర్ ఎలాంటి ఎత్తులు మారతాయా అన్నది ఆసక్తికరంగా మారింది.

  First published:

  Tags: Bjp, CM KCR, Congress, Lok sabha election results, Telangana Politics, Trs

  ఉత్తమ కథలు