ప్రతీ జనవరిలో ఉద్యోగాల నోటిఫికేషన్... సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం

వైఎస్ జగన్

ప్రతీ ఏడాది జనవరిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఖాళీగా ఎన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నింటిని కూడా భర్తీ చేస్తామన్నారు సీఎం జగన్.

  • Share this:
    ఏపీలో నిరుద్యోగ యువతకు మరో శుభవార్త చెప్పారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఇక నుంచి ప్రతీ ఏడాది జనవరిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఖాళీగా ఎన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నింటిని కూడా భర్తీ చేస్తామన్నారు. మరో మూడ నెలల్లో జనవరి వస్తుందన్న సీఎం.. అభ్యర్థులంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జనవరి నెలంతా ఉద్యోగాల నెలగా ఉంటుందన్నారు. విజయవాడలో సచివాలయ ఉద్యోగులకు నియామక పత్రాలు అందించిన సీఎం... ఉద్యోగులంతా బాధ్యతగా పనిచేయాలన్నారు. తమ ప్రాంత వాసుల రుణం తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఒకేసారి లక్షా 20వేల ఉద్యోగాల్ని సృష్టించిన ఘనత ఏపీదే అన్నారు సీఎం.
    వైఎస్ జగన్

    దేశ చరిత్రలోనే అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ ఉద్యోగాలు కల్పించామన్నారు. సొంత మండలంలోనే పనిచేసే అవకాశం రావడం నిజంగా అదృష్టమన్నారు జగన్. అధికారం చెలాయించడంకోసం ఉద్యోగం కాదన్నారు. ప్రజల కోసం పనిచేసే బాధ్యతగా ఉద్యోగి ఉండాలన్నారు జగన్. ప్రస్తుతం గ్రామల్లో పాలన వెంటిలేటర్‌పై ఉందన్నారు. ఆ పరిస్థితిని మార్చేందుకే గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. రైతులకు నాణ్యమైన ఎరువుల్ని అందిస్తామన్నారు. ప్రతీ గ్రామ వాలంటీర్‌కు స్మార్ట్ ఫోన్ ఇస్తామన్నారు.
    First published: