తెలుగు రాష్ట్రాల్లో ‘ఎట్ హోం’.. ఈసారి ఆ ఒక్కటే విశేషం..

ఏపీకి కొత్తగవర్నర్ రాకముందు వరకు ఉమ్మడి గవర్నర్‌గా నరసింహన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించేవారు. అప్పట్లో దీనిపై రాజకీయవర్గాలు, మీడియాలో చాలా ఉత్సాహం ఉండేది.

news18-telugu
Updated: August 15, 2019, 9:21 PM IST
తెలుగు రాష్ట్రాల్లో ‘ఎట్ హోం’.. ఈసారి ఆ ఒక్కటే విశేషం..
ఎట్ హోం కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ దంపతులకు పుష్పగుచ్ఛం ఇస్తున్న సీఎం కేసీఆర్
  • Share this:
తెలుగు రాష్ట్రాల్లో పంద్రాగస్ట్ రోజు గవర్నర్ నిర్వహించే ఎట్ హోం కార్యక్రమం జరిగింది. అయితే, రెండు రాష్ట్రాలకు ఈ సారి ఇద్దరు గవర్నర్లు ఉండడంతో ఏపీలో వేరుగా, తెలంగాణలో వేరుగా ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా వచ్చిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడలో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణలో గవర్నర్ నరసింహన్ ఎట్ హోం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ మోహన్ రెడ్డి, మరికొందరు నేతలు, ముఖ్యలు మాత్రమే హాజరయ్యారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ హాజరుకాలేదు. ఇక తెలంగాణలో సీఎం కేసీఆర్, కాంగ్రెస్ నుంచి ఉత్తమ్, జానారెడ్డి, రేవంత్ రెడ్డి, బీజేపీ నుంచి లక్ష్మణ్, దత్తాత్రేయ తదితరులు హాజరయ్యారు.

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ ఇచ్చిన తేనీటి విందుకు హాజరైన సీఎం జగన్


ఏపీకి కొత్తగవర్నర్ రాకముందు వరకు ఉమ్మడి గవర్నర్‌గా నరసింహన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించేవారు. అప్పట్లో దీనిపై రాజకీయవర్గాలు, మీడియాలో చాలా ఉత్సాహం ఉండేది. ఎవరెవరు హాజరయ్యారు?, ఎవరెవరు పక్కపక్కన కూర్చుని నవ్వుల్లో మునిగారు? ఎవరితో ఎవరెవరు రహస్య సంభాషణలు జరిపారు?, కేసీఆర్ - చంద్రబాబు మాట్లాడుకుంటారా? లేదా? వంటి పలు ఆసక్తికరమైన చర్చలు జరిగేవి. ఇప్పుడు రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా ఎట్ హోం జరగడంతో ఆ ఆసక్తి పూర్తిగా తగ్గిపోయింది. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం నుంచి ఎవరూ రాకపోవడంతో అక్కడ పెద్దగా ఆసక్తి కనిపించలేదు. తెలంగాణలో కేసీఆర్ పలువురు కాంగ్రెస్ నేతలకు షేక్ హ్యాండ్ ఇవ్వడం కనిపించింది. రేవంత్ రెడ్డిని మాత్రం పలకరించకుండా వెళ్లిపోయారు.

First published: August 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...