ఓరుగల్లు ఖాతాలో రెండు రికార్డులు.. అవి ఏవో తెలుసా..

Lok Sabha Elections 2019: వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నోటా ఓట్లలో తొలిస్థానంలో నిలిచింది. అక్కడ 18,801 నోటా ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్లలో అది 1.77 శాతం.

news18-telugu
Updated: May 24, 2019, 4:00 PM IST
ఓరుగల్లు ఖాతాలో రెండు రికార్డులు.. అవి ఏవో తెలుసా..
పసునూరి దయాకర్ (ఫైల్)
  • Share this:
వరంగల్ లోక్‌సభ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన పసునూరి దయాకర్ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ (3,50,298 ఓట్ల)తో గెలిచారు.
వరంగల్ ఓటర్లు మరో విషయంలోనూ రికార్డు సృష్టించారు. వరంగల్ మరో రికార్డు కూడా నెలకొల్పింది. అదే నోటా. వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నోటా ఓట్లలో తొలిస్థానంలో నిలిచింది. అక్కడ 18,801 నోటా ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్లలో అది 1.77 శాతం. ఆ తర్వాత మల్కాజిగిరిలో 17,895 మంది నోటాను ఎంచుకున్నారు. మొత్తంగా 17 నియోజకవర్గాల్లో 1,90,798 మంది నోటాకు ఓటేశారు. అయితే, మొన్నటి అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఇది తక్కువే. ఆ ఎన్నికల్లో నోటాకు 2.25 లక్షల ఓట్లు పోలయ్యాయి. 2014 జమిలీ ఎన్నికల్లో తమకు ఏ అభ్యర్థి నచ్చలేదని 1.52 లక్షల మంది నోటా మీట నొక్కారు.

మరోవైపు, నిజామాబాద్‌లో మొత్తం 185 మంది బరిలో నిలవగా కేవలం 2031 ఓట్లు నోటాకు పడ్డాయి. అక్కడ సీఎం కేసీఆర్ కూతురు కవిత టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలవగా, డీఎస్ కుమారుడు అరవింద్ బీజేపీ అభ్యర్థిగా, కాంగ్రెస్ తరఫున మధుయాష్కీ గౌడ్ పోటీ చేశారు. ఈ పోరులో కవితపై అరవింద్ గెలుపొందారు. అయితే, ఇక్కడ విశేషమేమిటంటే.. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాల్లోకెళ్లా నిజామాబాద్‌లోనే అత్యల్పంగా నోటా ఓట్లు పోలయ్యాయి.

తెలంగాణలో నోటా పరిస్థితి ఇదీ..
First published: May 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు