ఏపీలో కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్న బెట్టింగ్ రాయుళ్లు

నగరాలు, పట్టణాల్లోనే కాదు. పల్లెల్లో కూడా జోరుగా పందాలు పెడుతున్నారు. ఈ క్రమంలో బెట్టింగ్ పెట్టడానికి ముందు కొందరు క్రాస్ చెకింగ్ చేసుకుంటున్నారు.

news18-telugu
Updated: May 17, 2019, 9:06 PM IST
ఏపీలో కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్న బెట్టింగ్ రాయుళ్లు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మరో వారం రోజుల్లో ఎన్నికల ఫలితాలు రానున్నాయి. మే 23న ఎన్నికల ఫలితాలు వస్తాయి. రిజల్ట్స్ దగ్గర పడే కొద్దీ రాష్ట్రంలో పొలిటికల్ బెట్టింగ్ కూడా జోరందుకుంది. ఎన్నికలు ముగిసిన వెంటనే చాలా మంది బెట్టింగ్‌లు పెట్టారు. మధ్యలో కొందరు బెట్టింగ్ రాయుళ్లు సర్వేలను నమ్ముకుని డబ్బులు పెట్టారు. అయితే, ఇప్పుడు కొత్తగా మరోసారి బెట్టింగ్ రాయుళ్లు పొలిటికల్ పందాలకు రెడీ అవుతున్నారు. నగరాలు, పట్టణాల్లోనే కాదు. పల్లెల్లో కూడా జోరుగా పందాలు పెడుతున్నారు. ఈ క్రమంలో బెట్టింగ్ పెట్టడానికి ముందు కొందరు క్రాస్ చెకింగ్ చేసుకుంటున్నారు.

రాజకీయ పార్టీల వెంట తిరిగే వారిని బెట్టింగ్ రాయుళ్లు సంప్రదిస్తున్నారు. అలాగే, మీడియాలో పనిచేసే వారికి కూడా ఫోన్లు చేసి వివరాలు తెలుసుకుంటున్నారు. ‘ఏ పార్టీకి అనుకూలంగా ఉంది? ఏమైనా సర్వేలు చేశారా? ఏ పార్టీపై పెడితే బెటర్’ అంటూ పలు ప్రశ్నలు సంధించి.. సమాధానాలు తెలుసుకుంటున్నారు. దీంతో పాటు ఎన్నికల విధులకు హాజరైన వారిని కూడా వివరాలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

First published: May 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>