రాష్ట్రంలో ఐపీసీ కాదు, వైసీపీ సెక్షన్లు అమలవుతున్నాయ్... టీడీపీ మహిళా నేత ధ్వజం

ముఖ్యమంత్రులెవరూ కూడా కళాకారులను ఎప్పుడూ అవమానించలేదని, కానీ జగన్ మాత్రం వారిని కూడా అవమానించేలా ప్రవర్తించడం దారుణమని దివ్యవాణి అన్నారు.

news18-telugu
Updated: October 11, 2020, 7:13 PM IST
రాష్ట్రంలో ఐపీసీ కాదు, వైసీపీ సెక్షన్లు అమలవుతున్నాయ్... టీడీపీ మహిళా నేత ధ్వజం
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ సీఎం
  • Share this:
రాజధాని అమరావతికోసం చిన్నాపెద్దా, ఆడామగ అనేతేడాలేకుండా అందరూ పోరాడుతున్నారని, వారి పోరాటాన్ని ప్రపంచమంతా గమనిస్తూనే ఉందని, టీడీపీ అధికారప్రతినిధి దివ్యవాణి తెలిపారు. ఆదివారం ఆమె తననివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. పాదయాత్రపేరుతో గతంలో వీధివీధి తిరిగిన జగన్మోహన్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక ప్రజలను వీధులపాలు చేశారని, వికేంద్రీకరణ అన్న జగన్ వికృత ఆలోచన కారణంగా 300రోజులుగా రైతులు, మహిళలు నానా అవస్థలు పడుతున్నారన్నారు. ఆ ఆలోచనే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందన్నారు. అధికారం ఉందికదా అని ప్రతిపక్షనేతలను అడ్డుకుంటున్న జగన్, అమరావతి రైతుల ఆందోళనలు, మహిళల ఆవేదనను మాత్రం అడ్డుకోలేక పోయారన్నారు. గతంలో చంద్రబాబు పేరే అన్నిపథకాలకు పెడుతున్నారంటూ, మాట్లాడిన వైసీపీ నోళ్లన్నీ ఇప్పుడు జగనన్న పేరుపై ఎందుకు స్పందించడం లేదన్నారు. రాష్ట్రంలో ఐపీసీసెక్షన్లు అమలుకావడం లేదని, వైసీపీ సెక్షన్లు అమలవుతున్నా, పోలీసుల సాయంతో అక్రమకేసులు పెడుతున్నా కూడా ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం నిజంగా అభినందనీయమన్నారు.

ముఖ్యమంత్రులెవరూ కూడా కళాకారులను ఎప్పుడూ అవమానించలేదని, కానీ జగన్ మాత్రం వారిని కూడా అవమానించేలా ప్రవర్తించడం దారుణమన్నారు. సబ్బంహరి 4అడుగుల స్థలం ఆక్రమించుకున్నాడని ఆయన ఇంటిగోడను కూలదోశారని, రాష్ట్రంకోసం 33వేలఎకరాలు భూమిని ధారాదత్తం చేసిన వారికి, తమభూమిని కోల్పోయిన వారికి ఇంకెంతకోపం ఉంటుందో ముఖ్యమంత్రికి ఆలోచనరావడం లేదా అని దివ్యవాణి ప్రశ్నించారు. జగన్ మాటలకు అర్థాలు వేరులే, ఆయన అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే అని నేడు ప్రజలంతా అనుకుంటున్నారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానిని స్వాగతించిన నోరే, ఇప్పుడు వికేంద్రీకరణ అనే వికృతఆలోచన చేసిందన్నారు. జగన్మోహన్ రెడ్డి విశాఖను రాజధానిగా ప్రకటించిన వెంటనే 73 వేలవరకు రిజిస్ట్రేషన్లు జరిగాయని, అక్కడ జరిగింది ఇన్ సైడర్ ట్రేడింగో, అమరావతిలో జరిగింది ఇన్ సైడర్ ట్రేడింగో చెప్పాలన్నారు.

tdp leader divyavani, divyavani joining in bjp, divyavani movies, ap news, ysrcp, tdp, telugu news, దివ్యవాణి, బీజేపీలోకి దివ్యవాణి
దివ్యవాణి (File)


దళితుల ఎదుగుదలను ఓర్వలేకనే, వారి ఆర్థిక ఉన్నతిని చూడలేకనే జగన్మోహన్ రెడ్డి, వైసీపీప్రభుత్వం దళిత రాజధానిపై కక్షకట్టిందన్నారు. రాజధాని ప్రాంతంలో 23శాతం వరకు రెడ్డివర్గం వారే ఉన్నారన్నారు. దళితులు విమానాల్లో ప్రయాణించడాన్ని అవహేళన చేయడం, రైతులను పట్టుకొని తూలనాడటం దుర్మార్గమన్నారు. సోషల్ మీడియా చేతిలో ఉందికదా అని రాజధానికోసం పోరాడేవారందరి గురించి హేళనచేయడం మంచిదికాదన్నారు. అమరావతిలో ఎటువంటి ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని జగన్ నియమించిన కమిటీలే చెప్పాయన్నారు. రాజధాని విషయం కోర్టులో ఉండగానే, అమరావతి మెట్రో కార్యాలయాన్ని ఎందుకు విశాఖకు తరలించారో చెప్పాలన్నారు. అమరావతిపై చేసిన తప్పుడు ఆరోపణలను వైసీపీ నేతలు గానీ, ప్రభుత్వపెద్దలుగానీ ఇప్పటివరకు ఎందుకు నిరూపించలేకపోయార న్నారు. అమరావతి ప్రకటన వచ్చాక ఆప్రాంతానికి సంబంధించి కోర్ కేపిటల్ ఏరియాలో 127ఎకరాలకు సంబంధించి మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగాయని, అభివృద్ధి చెందే ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వారు, పరిశ్రమలవారు భూములు కొంటే అదితప్పెలా అవుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రయ్యాక ఏపీలో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందని వైసీపీవారే చెబుతున్నారన్నా రు.

రఘురామకృష్ణం రాజు తనకు, తనపార్టీకి మద్ధతుగా మాట్లాడ లేదనే, ప్రభుత్వం ఆయనపైకి సీబీఐని పంపిందన్నారు. రాష్ట్రయువత ఉపాధికోసం పొరుగురాష్ట్రాలకు వెళ్లకూడదన్న ఉద్దేశంతోనే, చంద్రబాబునాయుడు అమరావతికి రూపకల్పన చేశాడన్నారు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి ఎందుకువెళ్లారొ, ఎందుకు తిరిగొచ్చారో ఎవరికీ తెలియదన్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 11, 2020, 7:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading