నేను ప్రధాని రేసులో లేను.. : తేల్చేసిన నితిన్ గడ్కరీ

Nitin Gadkari Comments : గతేడాది జరిగిన రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి తర్వాత గడ్కరీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. నాయకత్వ స్థానంలో ఉన్నవాళ్లు గెలుపుతో పాటు ఓటమిని అంగీకరించేందుకు కూడా సిద్దంగా ఉండాలని అప్పట్లో వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: March 2, 2019, 7:50 AM IST
నేను ప్రధాని రేసులో లేను.. : తేల్చేసిన నితిన్ గడ్కరీ
నితిన్ గడ్కరీ(File)
news18-telugu
Updated: March 2, 2019, 7:50 AM IST
తాను ప్రధానమంత్రి రేసులో లేనని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మరోసారి స్పష్టం చేశారు. తాను పక్కా ఆర్ఎస్ఎస్ వ్యక్తిని అని, దేశమే తనకు సుప్రీం అని తెలిపారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పూర్తి స్థాయి ఆధిక్యం కనబరుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ది పథంలో దూసుకెళ్తోందని.. తామంతా ఆయనకు మద్దతుగా వెనకాలే నిలుచున్నామని అన్నారు.

నేను ప్రధాని రేసులో లేను. మోదీ గారే ప్రధాని, ఆయనే మళ్లీ ప్రధాని అవుతారు. నేను ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చివాడిని.. దేశం కోసం పనిచేయడమే మా మిషన్. మోదీ నాయకత్వంలో దేశం బాగా అభివృద్ది సాధిస్తోంది.. మేమంతా ఆయనతోనే ఉన్నాం. ఇక నేను ప్రధాని అవడం అన్న ప్రశ్న ఎక్కడినుంచి తలెత్తుతుంది?.
ప్రధానమంత్రి మోదీ


గతేడాది జరిగిన రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి తర్వాత గడ్కరీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. నాయకత్వ స్థానంలో ఉన్నవాళ్లు గెలుపుతో పాటు ఓటమిని అంగీకరించేందుకు కూడా సిద్దంగా ఉండాలని అప్పట్లో వ్యాఖ్యానించారు. దానికి తోడు మోదీ గ్రాఫ్ పడిపోతుందని.. ప్రధాని అభ్యర్థుల జాబితాలో నితిన్ గడ్కరీతో పాటు మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌తో పేర్లను ఆర్ఎస్ఎస్ పరిశీలిస్తున్నట్టు ఊహాగానాలు కూడా వినిపించాయి. దీంతో గడ్కరీ ప్రధాని రేసులో ఉండబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెడుతూ అలాంటిదేమి లేదని గడ్కరీ తేల్చేశారు.
First published: March 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...