NOT IN CHANDIGARH SPEND TIME IN YOUR CONSTITUENCIES PUNJAB CM ELECT BHAGWANT MANN TO AAP MLAS PVN
AAP : రాజధానిలో కాదు నియోజకవర్గాల్లోనే ఉండాలి..ఎమ్మెల్యేలకు ఆప్ ఆదేశాలు
కేజ్రీవాల్ తో భగవత్ మాన్(ఫైల్ ఫొటో)
Bhagwant Mann To AAP MLAs : తాజాగా జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. పంజాబ్ ఎన్నికల్లో బంపర్ విక్టరీ సాధించిన నేపథ్యంలో ఆప్ శాసనసభా పక్ష సమావేశం శుక్రవాం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలందరూ భగవంత్ మాన్ ను శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు.
Bhagwant Mann To MLAs : తాజాగా జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. పంజాబ్ ఎన్నికల్లో బంపర్ విక్టరీ సాధించిన నేపథ్యంలో ఆప్ శాసనసభా పక్ష సమావేశం శుక్రవాం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలందరూ భగవంత్ మాన్ ను శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు. ఈ క్రమంలో మార్చి 16న ప్రమాణ స్వీకారం చేసేందుకు భగవంత్ మాన్ సిద్ధమవుతున్నారు.
ఈ సందర్భంగా భగవంత్ మాన్ మాట్లాడుతూ…ఎమ్మెల్యేలందరూ తమ తమ నియోజకవర్గాల్లోనే ఉండాలని, అంతేగానీ పార్టీ ఆఫీసులోనే వుండొద్దని, రాజధానిలోనే మకాం వేయవద్దని సూచించారు. అంతేకాకుండా మంత్రివర్గంలో చోటు కోసం కూడా ఉబలాటపడొద్దని తేల్చి చెప్పారు. "మన మన నియోజకవర్గాల్లో పనిచేయాలి. మనపై నమ్మకం ఉంచిన వారి కోసం పనిచేయాలి. మన మన నియోజకవర్గాల్లోనే నిత్యం ఉండాలి. కేవలం చండీగఢ్‌లోనే ఉండొద్దు"అని భగవంత్ మాన్ ఎమ్మెల్యేలకు సూచించారు. ప్రస్తుతం 17 మంది మంత్రులతో ఉన్న కేబినెట్ ఉందని, ఎవ్వరూ నిరాశ చెందవద్దని విజ్ఞప్తి చేశారు. అందరూ కేబినెట్ మంత్రులేనంటూ భగవంత్ మాన్ ఎమ్మెల్యేలతో అన్నారు.
మార్చి 16న సీఎంగా తన స్వీకారోత్సవానికి ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను భగవంత్ మాన్ ఆహ్వానించారు. కేజ్రీవాల్‌తో కలిసి మార్చి 13న అమృత్సర్ లో భగవంత్ మాన్ రోడ్ షో నిర్వహించనున్నారు. అయితే ప్రమాణ స్వీకారానికి సంబంధించి భగవంత్ మాన్ ఇప్పటికే సంచలన ప్రకటన చేశారు. రాజ్‌భవన్ లో తాను ప్రమాణ స్వీకారం చేయనని తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ పూర్వీకుల గ్రామమైన నవాన్ షహర్ జిల్లాలోని ఖట్కర్ కలన్‌లో తన ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించనున్నట్లుగా వెల్లడించారు. ఈ ప్రకటనపై ఆప్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. భగవంత్ మాన్ ధురి నియోజకవర్గం నుంచి 58 వేలకు పైగా మెజారిటీతో భగవంత్ మాన్ విజయం సాధించారు.
మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ భగవంత్ మాన్ శనివారం గవర్నర్ తో భేటీ కానున్నారు. ప్రస్తుత సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ శుక్రవారం తన రాజీనామాను గవర్నర్ కు సమర్పించారు. రాజీనామా పత్రాలను గవర్నర్ కు అందజేశారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.