కర్ణాటకలో జోరందుకున్న నామినేషన్ల పర్వం

కర్ణాటకలో జరగబోయే ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల్లో పలువురు సోమవారం తమ నామినేషన్లు దాఖలు చేశారు.

news18-telugu
Updated: November 18, 2019, 11:56 PM IST
కర్ణాటకలో జోరందుకున్న నామినేషన్ల పర్వం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కర్ణాటకలో అప్పుడే ఉప ఎన్నికల సందడి మొదలైంది. తాజాగా 15 స్థానాలకు జరుగునున్న ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సోమవారం పలు పార్టీల అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. ఈ ఉప ఎన్నికల్లో బిజెపిని మట్టికరిపించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న కాంగ్రెస్‌ పార్టీ మొత్తం 15 స్థానాల్లో తమ అభ్యర్థులతో నామినేషన్లు వేయించింది. బెంగళూరు శివాజీనగర్‌ సీటుకు రిజ్వాన్‌ ఆర్షద్‌,మహాలక్ష్మి లేఔట్‌కు శివరాజు,హౌసకోట సీటుకు పద్మావతి సురేష్‌,యశ్వంతపుర సీటుకు పి.నాగరాజు, రాణి బెన్నూరు కు మాజీ స్పీకర్‌ కెబి.కోళీవాడ్‌, హిరేకెరూరు కు బిహెచ్‌.బన్నికోడ్‌, యల్లాపురకు భీమణ్ణనాయక్‌, హుణసూరుకు హెచ్‌పి. మంజునాధ్‌,కృష్ణరాజపేటకు కెబి.చంద్రశేఖర్‌, హౌసపేట విజయనగరకు వెంకటరావు ఘోర్పడె,కాగవాడకు రాజు కాగే,గోకాక్‌కు లఖన్‌ జారకిహౌళి,అథణికు గజానన మంగసూళిల చేత నామినేషన్లు వేయించింది.

కృష్ణరాజపురం సీటులో పార్టీ అభ్యర్థి నారాయణస్వామి నామినేషన్‌ ర్యాలీకి మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య హాజరయ్యారు. ఇక బిజెపి పార్టీ తరపున 11మంది అనర్హశాసనసభ్యులు సోమవారం నామినేషన్లు వేశారు.వీరు కాకుండా రాణిబెన్నూరు సీటుకు అరుణ్‌కుమార్‌,శివాజీనగర్‌కు శరవణచేత నామినేషన్లు వేయించింది. ఈ సందర్భంగా జరిగిన ర్యాలీలో పలువురు మంత్రులు పాల్గొన్నారు.
Published by: Kishore Akkaladevi
First published: November 18, 2019, 11:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading