Breaking News: టీటీడీ ఛైర్మన్ గా వై.వి.సుబ్బారెడ్డికి రెండో ఛాన్స్.. ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన సీఎం

ప్రతీకాత్మకచిత్రం

మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్.. ఇకపై జోడు పదవులకు బ్రేక్ వేశారు. తాజాగా నామినేటెడ్ పదవులను ప్రకటించారు. అందులో 56 శాతం వెనుకబడిన తరగతులకు.. 50 శాతం మహిళలకు అవకాశం ఇచ్చారు. రెండో సారి టీటీడీ చైర్మన్ గా వైవీకి అవకాశం ఇచ్చారు. తాజా సీఎం నిర్ణయంతో ఎమ్మెల్యేలకు నిరాశ తప్పలేదు.

  • Share this:
    ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో జోడు పదవుల విదానానికి బ్రేక్ ఇచ్చారు. ఒకరికి ఒక పదవే అన్న సూత్రానికి తెర లేపారు. తాజాగా నామినేటెడ్ పోస్టుల్లో దీన్ని అమలు చేశారు. అలాగే మొత్తం 135 పోస్టులకు గాను.. 56 శాతం వెనుకబడిన వర్గాలకు.. 50 శాతం మహిళలకు అవకాశం ఇచ్చారు. నామినేటెడ్ పదవుల్లో ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డికి అవకాశం కల్పించారు.  అయితే ఆయన ఆ పదవి కోరుకోవడం లేదని.. క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని ఉందంటూ మనసులో మాట ఇటీవల బయట పెట్టారు. కానీ అధిష్టానం మాత్రం ఆయనను రెండోసారి అదే పదిలో కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది.. మరోవైపు ఏపీ నామినేటెడ్ పదవుల్లో ఎమ్మెల్యేలకు సరికొత్త ట్విస్ట్ ఇస్తూ ఎవరికీ కూడా కార్పొరేసన్, చైర్మన్ పదవులకు అవకాశం వ్వలేదు.  ముఖ్యంగా పార్టీ కోసం కష్టపడి పని చేసిన కార్యకర్తలకు కోర్పారేషన్ చైర్మన్ పదవుల్లో భారీగా కేటాయింపులు జరిపారు.

    గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారికి మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే ఎమ్మెల్యే టికెట్లు త్యాగం చేసిన వారికి రెండో ప్రాధాన్యత కింద అవకాశం ఇచ్చారు. ముఖ్యంగా పార్టీ కోసం మొదటి నుంచి కష్ట పడిన వారికే ప్రాధాన్యం కల్పించారు. అలాగే నామినేటెడ్ పోస్టుల్లో ఉభయ గోదావరి జిల్లాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో 17 మందికి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 12 మందికి అవకాశం కల్పించారు. తరువాత సీఎం జగన్ సొంత జిల్లాలో 11 మందికి.. కాబోయే రాజధాని విశాఖలో 10 మందికి అవాకశం కల్పిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.

    జిల్లాల వారీగా నామినేషన్ పోస్టులు ఇవే..                                                                                                    శ్రీకాకుళం జిల్లా: 7 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 6 పోస్టులు,
    విజయనగరం జిల్లా: 7 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు
    విశాఖ జిల్లా: 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు
    తూర్పు గోదావరి: 17 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 9 పోస్టులు
    పశ్చిమగోదావరి: 12 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 6 పోస్టులు
    కృష్ణా జిల్లా : 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 6 పోస్టులు
    గుంటూరు జిల్లా : 9 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 6 పోస్టులు
    ప్రకాశం జిల్లా: 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు
    నెల్లూరు జిల్లా: 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు
    చిత్తూరు జిల్లా: 12 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 7 పోస్టులు
    అనంతపురం : 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు
    కడప జిల్లా: 11 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 6 పోస్టులు
    కర్నూలు జిల్లా: 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు

    నామినేటెడ్ పోస్టుల జాబితా ఇదే..

    టీటీడీ చైర్మన్ గా మరోసారి వైవీ సుబ్బారెడ్డికి అవకాశం
    బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా సుధాకర్
    క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ గా జోసెఫ్ వెస్లీ
    నెడ్ క్యాప్ చైర్మన్ గా కేకే రాజు
    సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ద్వారంపూడి భాస్కర్‌రెడ్డి
    వీఎంఆర్‌డీఏ ఛైర్మన్‌గా అక్కరమాని విజయనిర్మల
    ఏపీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌గా గేదెల బంగారు
    గ్రంథాలయ ఛైర్‌ పర్సన్‌గా రెడ్డి పద్మావతి
    హితకారిణి సమాజం ఛైర్మన్‌గా కాశీ మునికుమారి                                                                                 డీసీఎంఎస్ ఛైర్మన్‌గా అవనపు భావన
    బుడా ఛైర్మన్‌గా ఇంటి పార్వతి
    Published by:Nagesh Paina
    First published: