news18-telugu
Updated: May 18, 2019, 6:51 PM IST
జీవిఎల్ నరసింహారావు (ఫైల్ ఫొటో)
బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాజా ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఓటమి ఖాయమైపోయిందన్నారు.ఈ నెల 23న ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబును కలిసేందుకు దేశంలోని ఏ నేత ఇష్టపడరని విమర్శించారు. ఫలితాలు వచ్చాక తిరగడానికి ఏమీ ఉండదని తెలిసే.. చంద్రబాబు ఇప్పుడే కాళ్లరిగేలా తిరుగుతున్నారని సెటైర్ వేశారు.
దేశంలో ఇప్పటికే కాంగ్రెస్ పనైపోయిందని.. అయినా సరే చంద్రబాబు ఆ పార్టీ చుట్టూ చెప్పులు అరిగిపోయేలా తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో అవినీతి పాలన చేసి సంపాదించిన డబ్బును చంద్రబాబు ఇతర రాష్ట్రాల్లో పంచుతున్నారని ఆరోపించారు. ఎవరెన్ని విమర్శలు చేసినా..ఈసారి
కూడా కేంద్రంలో బీజేపీదే విజయం అని ఆయన ధీమాగా చెప్పారు. బీజేపీకి ప్రజలు పూర్తి మెజారిటీ కట్టబెడుతారని, సామాన్యులంతా మోదీ వైపే ఉన్నారని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్కు 55 సీట్లకు మించవని జోస్యం చెప్పారు.ఇక ఫలితాలు వెలువడే రోజే సోనియా గాంధీ నిర్వహించబోతున్న సమావేశం కేవలం తమ బాధను వ్యక్తపరుచుకోవడానికే అని విమర్శించారు.
Published by:
Srinivas Mittapalli
First published:
May 18, 2019, 12:15 PM IST