AP Capital: 3 రాజధానులు కాదు 33..! ఆధ్యాత్మిక రాజధానిగా తిరుపతి.. అందాల రాజధానిగా అరుకు.. నిజమేంటి?

ఏపీకి మూడు కాదు 33 రాజధానులు

ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు కాదా..? 33 రాజధానులా..? మూడు రాజధానుల రచ్చే ఇంకా కొనసాగుతోంది.. ఇప్పుడు 33 రాజధానుల గోలేంటి అనుకుంటున్నారా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ మెసేజ్ వైరల్ గా మారింది. మంత్రి పెద్ది రెడ్డి కామెంట్ల ఆధారంగా ఆ మెసేజ్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

  • Share this:
    ఇటీవల ఢిల్లీకి వెళ్లి అమిత్ షాను కలిసిన సీఎం జగన్ మూడు రాజధానులకు మద్దతు ప్రకటించాలని కోరినట్టు ప్రచారం జరిగింది. సీఎం జగన్ పర్యనట ముగిసిన వెంటనే రాష్ట్ర మంత్రులు, వైసీపీ నేతలు సైతం త్వరలోనే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటనలు చేశారు. అయితే ఈ మూడు రాజధానులపై రెండేళ్లుగా పెద్ద రచ్చే జరుగుతోంది. మూడు రాజధానులకు అనుకూలంగా.. వ్యతిరేకంగా వాధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇక అమరావతి రాజధాని రైతులైతే ఏకంగా సంవత్సరాల తరబడి ఆందోళన కొనసాగిస్తున్నారు. ఒక్క అధికార వైసీపీ తప్ప మిగిలిన రాజకీయ పార్టీలు సైతం మూడు రాజధానుల ప్రాతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, అమరావతి ప్రాంత వాసులు అధికంగా మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతికిస్తున్నారు. తాజాగా మంత్రి పెద్ది రెడ్డి మాట్లాడుతూ ఏపీకి మూడు రాజధానులు కాదు.. అవసరమైతే 33 రాజధానులు కూడా ఏర్పాటు చేస్తామని ఓ సందర్భంలో అన్నారు. అయితే ఆయన వ్యాఖ్యల ఆధారంగా ప్రస్తుతం ఏపీలో ఓ మెసేజ్ వైరల్ అవుతోంది. ఏపీకి మూడు కాదు ముప్పైమూడు రాజధానులంటూ వైరల్ అవుతోంది ఓ మెసేజ్.

    ఏపీలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో స్పెషాలిటీ ఉంది. జిల్లాకో ప్రత్యేకత వుంది. కొన్ని పట్టణాలకు కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అలా ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రత్యేకతల ఆధారంగా ఒక్కో రాజధానిగా పేర్కొంటూ చేసిన మెసేజ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అందులో మొదటిగా కలియుగ వైకుంఠంగా పిలిచే తిరుపతిని ఏపీ అధ్యాత్మిక రాజధానిగా పేర్కొన్నారు. ఊటీని తలపించే ప్రకృతి అందాలను కలిగి వున్న అరకు వ్యాలీని ఏపీ అందాల రాజధానిగా ప్రస్తావించారు. రకరకాల మామిడి పళ్ళకు ప్రసిద్ది గాంచిన నూజివీడును మామిడికాయల రాజధానిగా ప్రకటించారు. అలాగే కొబ్బరి తోటలతోను, కోనసీమ అందాలతో కలగలిసిన అమలాపురాన్ని కొబ్బరికాయల రాజధానిగా ఈ మెసేజ్‌లో పేర్కొన్నారు.

    ఇదీ చదవండి: చంద్రబాబు-సోనూ సూద్ ల ఐక్య కార్యచరణ... మాజీ సీఎంపై రియల్ హీరో పొగడ్తలు

    చూడగానే నోరూరించి.. నోట్లో వేయగానే కరిగిపోయే పూతరేకులకు ప్రసిద్ధిగాంచిన ఆత్రేయపురాన్ని పూతరేకుల రాజధాని అని. కాజాలకు ప్రసిద్ది అయిన కాకినాడను కాజాల రాజధాని అని.. మడత కాజాలకు పేరుగాంచిన తాపేశ్వరాన్ని మడతకాజాల రాజధాని అంటూ ఇలా పేరు పెట్టారు. తొక్కుడు లడ్డుకు పేరుగాంచిన బందరును తొక్కుడు లడ్డు రాజధానిగాను.. ఘాటైన మిరపకాయలకు పేరెన్నిక గన్న గుంటూరును మిరపకారం రాజధానిగాను, ఘనమైన విద్యాసంస్థలకు కేంద్రమైన విజయవాడను విద్యా రాజధానిగాను ఆ మేసేజ్ లో పేర్కొన్నారు.

    ఇదీ చదవండి: కొత్త బిజినెస్ ప్లాన్ చేస్తున్న జగపతి బాబు..! ఆనందయ్యతో కలుస్తారా..?

    సుందరమైన బొమ్మలకు నెలవైన కొండపల్లిని బొమ్మల రాజధానిగాను, పొగరైన గిత్తలతో అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన ఒంగోలును గిత్తల రాజధానిగాను చెబుతున్నారు. మూత్రపిండాల వ్యాధులతో యావత్ దేశం జాలిని పొందిన ఉద్దానాన్ని కిడ్నీ వ్యాధుల రాజధానిగాను, పలాసను జీడిపప్పు రాజధానిగాను పేర్కొన్నారు. సంక్రాంతి వచ్చిందంటే చాలు వార్తలకెక్కే భీమవరాన్ని కోడిపందాల రాజధానిగా వర్ణించారు. గుడివాడను ఎడ్లపందాల రాజధానిగా పిలుస్తున్నారు. కరవు రాజధానిగా అనంతపురాన్ని, తుఫాన్ల రాజధానిగా దివిసీమను, క్రీస్తు రాజధానిగా ఇడుపుల పాయను, విమానాశ్రయ రాజధానిగా గన్నవరాన్ని, రోజ్ మిల్క్ రాజధానిగా రాజమహేంద్రవరాన్ని, అరటిపళ్ళ రాజధానిగా రావుల పాలేన్ని చూపిస్తున్న ఈ మెసేజ్ వివిధ పార్టీల సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది..

    ఇదీ చదవండి: ఏపీలో మరో కంశుడు.. మూడేళ్ల చిన్నారిని హత్య చేసిన మేనమామ.. కారణం తెలిస్తే షాక్ అవుతారు

    ఎగ్జిక్యూటివ్ కేపిటల్ కాబోతున్న విశాఖపట్నాన్ని హార్బర్ రాజధానిగా పేర్కొనడం విశేషం. నాటకాల రాజధానిగా చిలకలూరిపేటను, ఫ్యాక్షన్ రాజధానిగా పులివెందులను, బెట్టింగ్ రాజధానిగా నెల్లూరును, కళల రాజధానిగా కూచిపూడిని, వస్త్ర వ్యాపార రాజధానిగా చీరాలను, బెల్లం రాజధానిగా అనకాపల్లిని, పసుపు రాజధానిగా దుగ్గిరాలను, ఆంధ్రాప్యారిస్ రాజధానిగా తెనాలిని ఇలా మొత్తంగా ఏపీకి 33 రాజధానులు అని ఈ మెసేజ్ తెగ వైరల్ అవుతోంది. ఈ వార్త నిజం కాకపోయినా.. ప్రస్తుతం రాజకీయ నాయకులు.. విపక్షాలు ఈ మెసేజ్ చూసి కాసేపు నవ్వుకుంటున్నారు.
    Published by:Nagesh Paina
    First published: