రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల వివరాలు వెల్లడించాల్సిందే : సుప్రీం

SC Orders Parties to Disclose Donation Details : రాజకీయ పార్టీలు నిధులు సమకూర్చుకునే విషయంలో పారదర్శకత ఉండాలంటే ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ప్రజలకు తెలియజేయాలని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అనే ఎన్జీవో సుప్రీంను ఆశ్రయించింది.

news18-telugu
Updated: April 12, 2019, 12:35 PM IST
రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల వివరాలు వెల్లడించాల్సిందే : సుప్రీం
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 12, 2019, 12:35 PM IST
ఎలక్టోరల్ బాండ్ల వివరాలను గోప్యంగా ఉంచడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కీలక తీర్పు వెలువరించింది. ఎలక్టోరల్ బాండ్స్‌ వివరాలు గోప్యంగా ఉంచడాన్ని తోసిపుచ్చుతూనే.. దానిపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. మే 30వ తేదీలోగా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు తమ విరాళాలు, దాతల వివరాలను ఎన్నికల కమిషన్‌కు సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్, జస్టిస్ దీపక్ గుప్తా, సంజీవ్ ఖన్నా నేత్రుత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.

రాజకీయ పార్టీలు నిధులు సమకూర్చుకునే విషయంలో పారదర్శకత ఉండాలంటే ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ప్రజలకు తెలియజేయాలని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అనే ఎన్జీవో సుప్రీంను ఆశ్రయించింది. ఎలక్టోరల్ బాండ్ల వివరాలను గోప్యంగా ఉంచే పక్షంలో వాటిపై స్టే విధించాలని ఆదేశించింది. అయితే స్టే ఇవ్వడానికి నిరాకరించిన కోర్టు.. దాతలు, విరాళాల విషయాలు మాత్రం వెల్లడించాల్సిందేనని స్పష్టం చేసింది.


First published: April 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...