• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • NO SPACE FOR NEW PARTY IN TELANGANA MINISTER GANGULA KAMALAKAR COMMENTS ON YS SHARMILA SK

Telangana: వైఎస్ షర్మిలపై తెలంగాణ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Telangana:  వైఎస్ షర్మిలపై తెలంగాణ మంత్రి సంచలన వ్యాఖ్యలు

వైఎస్ షర్మిల

తెలంగాణలో కొందరు వేరే పార్టీ పెట్టేందుకు చూస్తున్నారని.. ఇక్కడ వేరే పార్టీలకు అవకాశం లేదని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. 90 శాతం ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నారన్న ఆయన.. సీఎం కెసిఆర్ పెట్టిన టిఆర్ఎస్‌నే ప్రజలు తమ పార్టీగా భావిస్తారని చెప్పారు.

  • Share this:
    తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిల పేరు హాట్ టాపిక్‌గా మారింది. రాజన్న రాజ్యం తెస్తానంటూ ఆమె చేపిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. త్వరలోనే కొత్త పార్టీ ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో షర్మిలపై టీఆర్ఎస్ నేతలు విమర్శల దాడిని పెంచారు. తాజాగా మంత్రి గంగుల కమలాకర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కొందరు వేరే పార్టీ పెట్టేందుకు చూస్తున్నారని.. ఇక్కడ వేరే పార్టీలకు అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. 90 శాతం ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నారన్న ఆయన.. సీఎం కెసిఆర్ పెట్టిన టిఆర్ఎస్‌నే ప్రజలు తమ పార్టీగా భావిస్తారని చెప్పారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ఆస్తి అని.. టీఆర్ఎస్ పార్టీనే ప్రజలు ఆదరిస్తారని అన్నారు.

    కరీంనగర్‌లో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ నియోజకవర్గంలో 60 వేల వరకు సభ్యత్వ నమోదు జరిగింది. అక్కడ టార్గెట్‌కు మించి సభ్యత్వ నమోదు జరిగిందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రైతులు, యువకులు, మహిళలు స్వచ్ఛందంగా టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారని చెప్పారు. టీఆర్ఎస్ సభ్యత్వం స్వీకరించడం ప్రజలు గర్వకారణంగా భావిస్తున్నారని ఆయన తెలిపారు.
    తెలంగాణలో కరోనా,కరీంనగర్ జిల్లాలో కరోనా,రామగుండంలో కరోనా,తెలంగాణలో కరోనా కేసులు,Coronacases in telangana,Coronaalert in karimnagar,corona alert in ramagundam,
    మంత్రి గంగుల కమలాకర్ (File)

    వైఎస్ షర్మిలను కొన్ని రోజులుగా గంగుల కమలాకర్ టార్గెట్ చేశారు. మొదట షర్మిల వస్తారని, ఆ తర్వాత జగన్ ఎంట్రీ, ఆ తర్వాత చంద్రబాబు వస్తారని.. అప్పుడు తెలంగాణలో మళ్లీ కొట్లాటలు తప్పవన్నారు. ‘ఇప్పుడు జగనన్న బాణం షర్మిల వస్తోంది. తర్వాత మెల్లగా జగన్ వస్తారు. జగన్ తర్వాత చంద్రబాబు కూడా వస్తారు. తెలంగాణలో మళ్లీ కొట్లాటలు తప్పవు. కేసీఆర్ ను మనం కాపాడుకోవాలి లేకపోతే ఇబ్బందులు తప్పవు. కేసీఆరే మన రక్షకుడు. ఆంధ్ర పెత్తనం వస్తే మళ్లీ మనకు కష్టాలు తప్పవు.’ అని గంగుల కమలాకర్ ఇటీవల అన్నారు.

    మరోవైపు ఆత్మీయ సమ్మేళనం పేరుతో వైఎస్ అభిమానులతో వైఎస్ షర్మిల వరుసగా భేటీ అవుతున్నారు. కొత్త పార్టీ కోసం వడివడిగా అడుగులు వేస్తున్నారు. మే 14 లేదా జులై 8న కొత్త పార్టీని ప్రకటించే అవకాశముందని జోరుగా చర్చ జరుగుతోంది. జూలై 8న వైఎస్ రాజశేఖర్‍రెడ్డి జయంతి. అందుకే జూలై 8న పార్టీని ప్రకటించేందుకు మొగ్గు చూపిస్తున్నారు. ఐతే అందుకు ఇంకా 5 నెలలు ఉన్నందున ఆలస్యమవుతుందని కొందరు నేతలు ఆమెకు సూచించారట. మే 14 అయితే బాగుంటుందని చెప్పినట్లు సమాచారం. మే 14నే సీఎంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజు పార్టీని ప్రకటిస్తే.. వెంటనే పాదయాత్ర ప్రారంభించవచ్చని నేతలు షర్మిలతో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ ఏర్పాటుకు సంబంధించి మే 14, జులై 8 తేదీలను షర్మిల పరిశీలిస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు