టీఆర్ఎస్ గెలుపు ఈజీ కాదు... కూటమికి అనుకూలంగా గణాంకాలు

Telangana Assembly Election: 2014 నాటి లెక్కల్ని చూసుకుంటే... కనీసం 16 నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఓట్లను ప్రజాకూటమి కొల్లగొట్టడం ఖాయం. అంతేకాదు... 2014లో గెలిచిన 37 సీట్లను నిలుపుకోగలదు. అయితే ఇది ఓట్ల బదిలీ సజావుగా జరిగినప్పుడే సాధ్యం. ఇప్పటికే తెలంగాణ ఉద్యమం నాటి సెంటిమెంట్ ఇంకా ప్రజల్లో ఉంది. చంద్రబాబునాయుడు బరిలోకి రావడంతో తెలంగాణ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా పోటీ మారిపోయింది.

news18-telugu
Updated: December 10, 2018, 4:51 PM IST
టీఆర్ఎస్ గెలుపు ఈజీ కాదు... కూటమికి అనుకూలంగా గణాంకాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
(రిషికా సదం, న్యూస్18 ప్రతినిధి)

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మంగళవారం ఉదయం కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలూ మిశ్రమంగా ఉండటంతో అసలు ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్, కాంగ్రెస్-టీడీపీ నేతృత్వంలోని ప్రజాకూటమి, రాష్ట్రంలో పుంజుకోవాలని చూస్తున్న బీజేపీ మధ్యే ఎన్నికలు జరిగాయి. చాలావరకు ఎగ్జిట్ పోల్స్ కేసీఆర్‌కు రెండోసారి అధికారం ఖాయమనే చెప్పాయి. 2014లో తెలంగాణ ఉద్యమం సెంటిమెంట్‌తో టీఆర్ఎస్ గెలిచింది. 63 స్థానాలు దక్కించుకుంది. మ్యాజిక్ నెంబర్ 60 కన్నా కొంచెం ఎక్కువ.

మరోవైపు కాంగ్రెస్ 21, టీడీపీ 15 స్థానాలు గెలుచుకుంది. రెండు పార్టీల ఓట్ల శాతం 25, 15. ఈ రెండు కలిస్తే ఓట్ల శాతం 40. కానీ టీఆర్ఎస్ ఓట్ల శాతం 34 మాత్రమే. పోల్ సర్వేలు టీఆర్ఎస్ విజయం ఖాయమని చెబుతున్నా, అంకగణితమే ఎన్నికల్లో కీలకపాత్ర పోషించనుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా కేసీఆర్ కారు సాఫీగా ముందుకు సాగలేదనే అనిపిస్తోంది. తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల్నే నమ్ముకున్న టీఆర్ఎస్... 100 స్థానాలు తమవేనన్న ధీమా వ్యక్తం చేస్తోంది.

రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు సారథ్యంలోని ప్రజాకూటమి దూకుడుగానే ముందుకెళ్లింది. కాంగ్రెస్ 98, టీడీపీ 13, టీజేఎస్ 8, సీపీఐ 3 స్థానాల్లో పోటీ చేశాయి. 1980వ దశకం నుంచి ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్, టీడీపీ... కేసీఆర్‌ను దెబ్బకొట్టేందుకు ఏకమయ్యాయి.


2014 నాటి లెక్కల్ని చూసుకుంటే... కనీసం 16 నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఓట్లను ప్రజాకూటమి కొల్లగొట్టడం ఖాయం. అంతేకాదు... 2014లో గెలిచిన 37 సీట్లను నిలుపుకోగలదు. అయితే ఇది ఓట్ల బదిలీ సజావుగా జరిగినప్పుడే సాధ్యం. ఇప్పటికే తెలంగాణ ఉద్యమం నాటి సెంటిమెంట్ ఇంకా ప్రజల్లో ఉంది. చంద్రబాబునాయుడు బరిలోకి రావడంతో తెలంగాణ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా పోటీ మారిపోయింది.

తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన చంద్రబాబు రాష్ట్రాన్ని నియంత్రించేందుకు కూటమి ద్వారా ప్రయత్నిస్తున్నారని కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ ఆరోపించారు. ఈ తండ్రీకొడుకులిద్దరూ ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించేందుకు ఇదే అస్త్రాన్ని ప్రయోగించారు. ఒకవేళ వాళ్లు తమ ఓట్‌ బ్యాంకును అలాగే నిలుపుకోగలిగితే తమ అస్త్రం పనిచేసినట్టే.


ఇక బరిలో ఉన్న మూడో పార్టీ బీజేపీ. గత ఎన్నికల్లో 5 సీట్లు వచ్చాయి. 2014లో టీడీపీతో పొత్తు కుదుర్చుకుంది. ఇప్పుడు ఒంటరిగానే బరిలోకి దిగింది. ఇంకా పుంజుకుంటామన్న విశ్వాసం బీజేపీది. తమ పార్టీ కింగ్ మేకర్ పాత్ర పోషిస్తుందని, ఏఐఎంఐఎంతో తెగదెంపులు చేసుకుంటే టీఆర్ఎస్‌కు మద్దతు ఇస్తామని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ న్యూస్18తో మాట్లాడుతూ తెలిపారు. ఈ ఎన్నికల్లో బరిలో ఉన్న మరో ప్రధాన పార్టీ ఏఐఎంఐఎం. గత ఎన్నికల్లో ఏడు స్థానాల్లో పోటీ చేసి అన్నీ గెలుచుకుంది. ఈసారి 8 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈసారి కూడా అన్నీ గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే అధికార పార్టీతో స్నేహపూర్వకంగా ఉంటోంది ఎంఐఎం. అంతేకాదు... అవసరమైతే ఈ స్నేహం కూటమిగా మారే అవకాశముందన్న వాదనలు వినిపిస్తున్నాయి.2018లో 72.4 పోలింగ్ శాతం నమోదైంది. అంతకుముందు 69.5 శాతంతో పోలిస్తే ఎక్కువ. మరి పెరిగిన ఓట్ల శాతం ఎవరి ఖాతాలో పడ్డాయి? ఫలితాల తర్వాతే తెలుస్తుంది.
First published: December 10, 2018, 4:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading