తెలంగాణలో దళితులకు రక్షణ కరువు.. వారిని కలుస్తామన్న ఉత్తమ్

13 శాతం జనాభా ఉన్న దళితులకు కేసీఆర్ కేబినెట్‌లో స్థానం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

news18-telugu
Updated: July 31, 2020, 6:17 PM IST
తెలంగాణలో దళితులకు రక్షణ కరువు.. వారిని కలుస్తామన్న ఉత్తమ్
ఉత్తమ్ కుమార్ రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణ రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోతుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో దళిత రైతు ఆత్మహత్య దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. దళితులపై జరుగుతున్న ఘటనలపై గవర్నర్, జాతీయ మానవ హక్కులను కలుస్తామని తెలిపారు. దళిత రైతుకు ఉన్న 13 గుంటలను టీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కున్న కారణంగానే రైతులు చనిపోయాడని అన్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్‌కు-రియల్ ఎస్టేట్ డీలింగ్స్ ఉన్నట్లు అక్కడి ప్రజలు అనుకుంటున్నారని ఉత్తమ్ ఆరోపించారు. రైతు మరణించించిన తరువాత ఎకరా భూమి ఇస్తున్నా అని హరీష్ రావు ప్రకటన దురదృష్టకారమని వ్యాఖ్యానించారు.

13 శాతం జనాభా ఉన్న దళితులకు కేసీఆర్ కేబినెట్‌లో స్థానం ఉండదని అన్నారు. ఒకటి రెండు జనాభా శాతం ఉన్న వారికి రెండు మూడు మంత్రి పదవులు ఉన్నాయని అన్నారు. మహబూబ్ నగర్‌లో రైతునుఇసుక లారీతో తొక్కి చంపించడం కంటే దారుణం ఏదైనా ఉంటుందా? అని ప్రశ్నించారు. కేసీఆర్ సీఎం అయ్యారంటే అంటే దళితులు-గిరిజనులే కారణమనే విషయాన్ని మర్చిపోవద్దని ఉత్తమ్ గుర్తు చేశారు. తెలంగాణలో పోలీసులు నిజాయితీగా ఉన్నా... కొంతమంది ఉన్నతాధికారుల వల్ల దళితుల ఘటనల్లో న్యాయం జరగడం లేదని అన్నారు. దళితులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ న్యాయపోరాటం చేస్తామని అన్నారు.
Published by: Kishore Akkaladevi
First published: July 31, 2020, 6:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading