NO RELIEF FOR CHIDAMBARAM AS SUPREME COURT SAYS CANT PASS ORDER RIGHT AWAY WILL SEND FILE TO CJI MS
సుప్రీంలో చిదంబరంకు దక్కని ఊరట.. ఇక అరెస్ట్ లాంఛనమే..
మాజీ కేంద్ర మంత్రి చిదంబరం (File Photo)
Chidambaram INX Media case : మధ్యాహ్నం సుప్రీం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ ఈ పిటిషన్ను విచారించే అవకాశం ఉంది. అయితే చిదంబరంకు అరెస్ట్ నుంచి రిలీఫ్ దక్కడం ఇక అనుమానంగానే కనిపిస్తోంది.
మాజీ కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం అరెస్ట్ లాంఛనంగానే కనిపిస్తోంది. ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ను రద్దు చేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆయనకు.. అక్కడ కూడా ఎదురుదెబ్బే తగిలింది. చిదంబరం స్పెషల్ లీవ్ పిటిషన్పై స్పందించిన సుప్రీం.. ఇప్పటికిప్పుడు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని చెప్పింది. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇవ్వలేమని స్పష్టం చేసింది. న్యాయమూర్తి రమణ మాట్లాడుతూ.. ఈ కేసును చీఫ్ జస్టిస్ ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. మధ్యాహ్నం సుప్రీం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ ఈ పిటిషన్ను విచారించే అవకాశం ఉంది. అయితే చిదంబరంకు అరెస్ట్ నుంచి రిలీఫ్ దక్కడం ఇక అనుమానంగానే కనిపిస్తోంది. ఇప్పటికైతే చిదంబరం ఆచూకీ ఇంకా తెలియరాలేదు.మంగళవారం రాత్రి సీబీఐ అధికారులు ఆయన ఇంటికి వెళ్లినప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన ఆచూకీ తెలియరాలేదు. చిదంబరం అరెస్ట్ కోసం ఇప్పటికీ మూడుసార్లు సీబీఐ అధికారులు ఆయన ఇంటికి వెళ్లారు. చిదంబరం దేశం దాటి వెళ్లకుండా ఉండేందుకు తాజాగా ఈడీ లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసింది. మరోవైపు కాంగ్రెస్ నేతలు మాత్రం దీన్ని కక్షపూరిత కోణంలోనే చూస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం కావాలనే కక్ష గట్టి ఇలా చేస్తోందని ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలు ఆరోపించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.