'మహా'రాజకీయం.. శరద్ పవార్‌పై ఎలాంటి డౌట్ లేదన్న కాంగ్రెస్..

అజిత్ పవార్‌ అవకాశవాదాన్ని బీజేపీ ఉపయోగించుకుందని.. ఆయన్ను జైలుకు పంపిస్తామని బెదిరించి తమవైపుకు తిప్పుకుందని సూర్జేవాలా ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనని విమర్శించారు.

news18-telugu
Updated: November 23, 2019, 6:57 PM IST
'మహా'రాజకీయం.. శరద్ పవార్‌పై ఎలాంటి డౌట్ లేదన్న కాంగ్రెస్..
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్
  • Share this:
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్‌పై తమకెలాంటి అనుమానాలు లేవని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా వ్యాఖ్యానించారు.జరిగిన పరిణామంపై శరద్ పవార్ ఇప్పటికే వివరణ ఇచ్చారని గుర్తుచేశారు. అజిత్ పవార్‌ అవకాశవాదాన్ని బీజేపీ ఉపయోగించుకుందని.. ఆయన్ను జైలుకు పంపిస్తామని బెదిరించి తమవైపుకు తిప్పుకుందని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనని విమర్శించారు. రాజ్యాంగానికి విరుద్దంగా ఫడ్నవీస్ సీఎం పీఠమెక్కారని మండిపడ్డారు. శరద్ పవార్ అన్న కొడుకు అజిద్ పవార్ ఎన్సీపీని చీల్చి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతునిచ్చిన నేపథ్యంలో సూర్జేవాలా ఈ వ్యాఖ్యలు చేశారు. తాజా వ్యాఖ్యలతో అజిత్ పవార్ అడుగుల వెనుక శరద్ పవార్ వ్యూహమేమి లేదని ఆయన పరోక్షంగా చెప్పదలుచుకున్నారు.

కాగా, నిజాయితీ గల ఎన్సీపీ కార్యకర్తలెవరూ బీజేపీతో చేతులు కలపరని శరద్ పవార్ వ్యాఖ్యానించారు. బీజేపీకి మద్దతునివ్వడం అజిత్ పవార్ వ్యక్తిగతమని.. ఎన్సీపీకి దానితో సంబంధం లేదని తెలిపారు.మరోవైపు అజిత్ పవార్‌కి మద్దతునిచ్చిన 9 మంది ఎమ్మెల్యేలు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నట్టు సమాచారం. ఇటు శివసేన,కాంగ్రెస్ బీజేపీ నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు..వారిని బెంగళూరు రిసార్టుకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద మహా రాజకీయం ఏ క్షణాన ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది.
Published by: Srinivas Mittapalli
First published: November 23, 2019, 6:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading