‘గల్లా జయదేవ్‌పై ఐటీ దాడులే జరగలేదు’

గల్లా జయదేవ్

గురప్ప నాయుడు నివాసం మినహా మరే ఇంట్లో కూడా తనిఖీ చేయలేదని సీబీడీటీ స్పష్టం చేసింది.

  • Share this:
    టీడీపీ ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ నివాసంపై ఎలాంటి ఐటీ దాడులు జరగలేదని సీబీడీటీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్) స్పష్టం చేసింది. మంగళవారం రాత్రి గల్లా జయదేవ్ నివాసంలో ఐటీ అధికారులు దాడి చేశారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీంతోపాటు గల్లా జయదేవ్, ఆయన అనుచరులు గుంటూరులోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా కూడా చేశారు. ఐటీ దాడుల అంశాన్ని కవర్ చేయడానికి వెళ్లిన మీడియా మీద కూడా గల్లా అనుచరులు దాడి చేశారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఏపీ సీఈవో ద్వివేదీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్ కార్యాలయం ముందు ధర్నా కూడా చేశారు. అయితే, అసలు గల్లా జయదేవ్ నివాసంలో ఎలాంటి ఐటీ దాడులు జరగలేదని సీబీడీటీ స్పష్టం చేసింది. అయితే, గల్లా జయదేవ్‌ కంపెనీల చార్టెడ్ అకౌంటెంట్ వద్ద లెక్కల్లో లేని రూ.45లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. అది కూడా విజయవాడలో నగదు సీజ్ చేసినట్టు ప్రకటించింది.

    ‘ఎన్నికల్లో పంచడానికి గురప్ప నాయుడు అనే వ్యక్తి వద్ద డబ్బులు దాచి పెట్టారని టోల్ ఫ్రీ నెంబర్‌కు సమాచారం రావడంతో అక్కడ సోదాలు చేశారు. ఆ సమయంలో అతని స్టేట్‌మెంట్ రికార్డు చేస్తున్న సమయంలో ఆయన గల్లా జయదేవ్ కంపెనీలకు కూడా చార్టెడ్ అకౌంటెంట్‌గా సేవలు అందిస్తున్నట్టు వెల్లడించారు.’ అని సీబీడీటీ తెలిపింది. గురప్ప నాయుడు నివాసం మినహా మరే ఇంట్లో కూడా తనిఖీ చేయలేదని స్పష్టం చేసింది.
    First published: