Maharashtra Crisis : ఆ ప్రసక్తే లేదు.. అజిత్ పవార్‌కు శరద్ పవార్ కౌంటర్..

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ట్వీట్లపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు.ఎన్సీపీ బీజేపీతో కలిసే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.

news18-telugu
Updated: November 24, 2019, 7:31 PM IST
Maharashtra Crisis : ఆ ప్రసక్తే లేదు.. అజిత్ పవార్‌కు శరద్ పవార్ కౌంటర్..
శరద్ పవార్ (File Photo)
  • Share this:
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ట్వీట్లపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు.ఎన్సీపీ బీజేపీతో కలిసే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. శివసేన,కాంగ్రెస్‌లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎన్సీపీ ఏకగీవ్రంగా తీర్మానించిందని చెప్పారు. అజిత్ పవార్ తన ట్వీట్లతో గందరగోళం సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అజిత్ పవార్ ట్వీట్స్ చేసిన గంటకే శరద్ పవార్ కూడా ట్వీట్స్ ద్వారా కౌంటర్ ఇచ్చారు.

అంతకుముందు అజిత్ పవార్ తన ట్వీట్లలో 'నేను ఎన్సీపీలోనే ఉన్నాను. ఎన్సీపీలోనే కొనసాగుతాను. మా నాయకుడు శరద్ పవారే' అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఎవరూ ఆందోళన చెందవద్దని.. అంతా సవ్యంగానే సాగుతోందని..కొంత సంయమనం పాటించాలని సూచించారు. అజిత్ చేసిన ఈ ట్వీట్లతో రాజకీయంగా కలకలం రేగింది. అజిత్ పవార్ ట్వీట్స్ తనపై అనుమానాలు రేకెత్తించేలా ఉండటంతో శరద్ పవార్ వెంటనే స్పందించారు.తన తాజా ట్వీట్ల ద్వారా అజిత్ పవార్‌ అడుగుల వెనుక తాను లేనని శరద్ పవార్ పరోక్షంగా మరోసారి స్పష్టం చేశారు.


Published by: Srinivas Mittapalli
First published: November 24, 2019, 7:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading