HOME »NEWS »POLITICS »no problem to ycp even local body elections held ap minister balineni srinivasa reddy comments hsn

Balineni Srinivasa Reddy: పంచాయతీ ఎన్నికలు జరిగితే వైసీపీకి వచ్చే నష్టం లేదు.. మంత్రి బాలినేని కామెంట్స్

Balineni Srinivasa Reddy: పంచాయతీ ఎన్నికలు జరిగితే వైసీపీకి వచ్చే నష్టం లేదు.. మంత్రి బాలినేని కామెంట్స్
మంత్రి బాలినేని, నిమ్మగడ్డ రమేష్ కుమార్ (ఫైల్ ఫొటోలు)

ఎన్నికల కమిషన్ వర్సెస్ ఏపీ సర్కారు అన్న రీతిలో ఆంధ్రా రాజకీయాలు సాగుతున్నాయి. టీడీపీతో సాటు ఇతర ప్రతిపక్షాలు ఎన్నికల నోటిఫికేషన్ ను స్వాగతిస్తుండగా, అధికార వైసీపీ మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించకపోవడమే ప్రజలకు శ్రేయష్కరమని వాదిస్తోంది. కరోనా టీకా విధులతో ప్రభుత్వ ఉద్యోగులు బిజీగా ఉంటారనీ, కరోనా స్ట్రెయిన్ కూడా వేగంగా వ్యాపిస్తోందని భయాందోళనలను వ్యక్తం చేస్తోంది.

  • Share this:
    ప్రకాశం: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు రాజకీయాలను మరింత హీటెక్కిస్తున్నాయి. ఎన్నికల కమిషన్ వర్సెస్ ఏపీ సర్కారు అన్న రీతిలో రాజకీయాలు సాగుతున్నాయి. టీడీపీతో సాటు ఇతర ప్రతిపక్షాలు ఎన్నికల నోటిఫికేషన్ ను స్వాగతిస్తుండగా, అధికార వైసీపీ మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించకపోవడమే ప్రజలకు శ్రేయష్కరమని వాదిస్తోంది. కరోనా టీకా విధులతో ప్రభుత్వ ఉద్యోగులు బిజీగా ఉంటారనీ, కరోనా స్ట్రెయిన్ కూడా వేగంగా వ్యాపిస్తోందని భయాందోళనలను వ్యక్తం చేస్తోంది. అందుకే ఎన్నికల నిర్వహణను వాయిదా వేయాల్సిందిగా హైకోర్టు మెట్లెక్కింది. ఈ నేపథ్యంలో నేతల కామెంట్స్ రాజకీయ సెగలను పుట్టిస్తోంది. తాజాగా ప్రకాశం జిల్లాలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఏపీ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ గురించి సంచలన కామెంట్స్ చేశారు.

    ’ఏపీలో పంచాయతీ ఎన్నికలు ఇప్పుడే కాదు, ఎప్పుడు జరిగినా వైసీపీకి వచ్చే ఇబ్బందేమీ లేదు. అయితే ప్రస్తుతం కరోనా స్ట్రెయిన్ విస్తరిస్తోందనే ఎన్నికలు వద్దంటున్నాం. ప్రజల సంరక్షణ కోసమే పంచాయతీ ఎన్నికలు వద్దని చెబుతున్నాం. చంద్రబాబు ఎలా చెబితే ఎన్నికల కమిషన్ అలా పని చేస్తుంది. చంద్రబాబు తొత్తులా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పనిచేస్తున్నారు. ప్రభుత్వ సలహాలు కూడా తీసుకోకుండా ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారు. ఎన్నికల నిర్వహణ గురించి ప్రభుత్వాన్ని సంప్రదించాల్సిన పని ఎన్నికల కమిషన్ కు లేదా? ఏది ఏమైనా కోర్టు తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటాం.‘ అని బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు.



    అదే సమయంలో కొన్ని కీలక విషయాలను కూడా వెల్లడించారు. ప్రధాన మంత్రి స్వరాష్ట్రం అయిన గుజరాత్ లో కూడా ఎన్నికలు వాయిదా వేశారని మంత్రి బాలినేని గుర్తు చేశారు. ఎన్నికల నిర్వహణను ఉద్యోగ సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయన్నారు. పోలీసు సంఘాలు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు వద్దనీ, విధులు నిర్వహించలేమని చెబుతున్నామన్నారు. ఇంత మంది వ్యతిరేకిస్తున్నా, వారి ప్రాణాలను ఫణంగా పెట్టయినా ఎన్నికలు నిర్వహించాలన్న ఉద్దేశంతో నిమ్మగడ్డ ఉన్నారని విమర్శించారు. ప్రజల ఆరోగ్యమే తమకు ముఖ్యమనీ, అనుకూల సమయం ఉన్నప్పుడే ఎన్నికలు నిర్వహిస్తే మేలని అభిప్రాయపడ్డారు. ఎన్నికలు ఎప్పుడుజరిగినా వైసీపీదే ఘన విజయం అని మరోసారి ఉద్ఘాటించారు.
    Published by:Hasaan Kandula
    First published:January 10, 2021, 15:03 IST

    टॉप स्टोरीज