ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో ప్రధాని మోదీపై తూర్పు యూపీ కాంగ్రెస్ ఇన్చార్జి ప్రియాంక గాంధీ పోటీ చేయబోతున్నారన్న ఊహాగానాలకు తెరపడింది. వారణాసి, గోరఖ్‌పూర్ స్థానాలకు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ గురువారం అభ్యర్థులను ప్రకటించింది. వారణాసిలో అజయ్ రాయ్‌ని, గోరఖ్‌పూర్‌లో మధుసూదన్ తివారీని బరిలో నిలిపింది. అధ్యక్షుడు రాహుల్ ఆదేశిస్తే వారణాసిలో మోదీపై పోటీకి సిద్దమని ప్రియాంక గాంధీ పలుమార్లు బహిరంగంగానే ప్రకటించినప్పటికీ.. పార్టీ అధిష్టానం మాత్రం ఆ రిస్క్ చేయదలుచుకోలేదని సమాచారం. మోదీపై పోటీలో చతికిలపడితే ప్రియాంక భవిష్యత్ రాజకీయాలకు అది ప్రతికూలంగా మారుతుందని కాంగ్రెస్ భావించినట్టు తెలుస్తోంది. కాబట్టే ఆమెను వారణాసిలో పోటీకి దూరంగా ఉంచినట్టు ప్రచారం జరుగుతోంది.
(కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అధికారిక ప్రకటన)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Narendra modi, Priyanka Gandhi, Uttar Pradesh Lok Sabha Elections 2019, Varanasi S24p77