ఓటేయడానికి వెళ్లిన వారికి షాక్.. అభ్యర్థి పేరు పక్కన బటన్ మిస్సింగ్

AMMK అభ్యర్థి పేరు పక్కన మాత్రమే బటన్ లేదు. దీంతో ఓటు వేయడానికి వెళ్లిన వారు దాన్ని గుర్తించి ఫిర్యాదు చేశారు.

news18-telugu
Updated: April 18, 2019, 3:01 PM IST
ఓటేయడానికి వెళ్లిన వారికి షాక్.. అభ్యర్థి పేరు పక్కన బటన్ మిస్సింగ్
ఈవీఎం బటన్‌లో అభ్యర్థి పేరు పక్కన బటన్ మిస్సింగ్
news18-telugu
Updated: April 18, 2019, 3:01 PM IST
తమిళనాడులోని కడలూరు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల్లో విచిత్రం చోటుచేసుకుంది. పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు పక్కన ఓటు వేయడానికి అసలు బటన్ లేదు. కడలూరు లోక్‌సభ పరిధిలోని ఓ పోలింగ్ స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. కడలూరు లోక్‌సభకు AMMK (టీటీవీ దినకరన్‌కు చెందిన పార్టీ) అభ్యర్థిగా కాశీ తంగవేల్ పోటీ చేస్తున్నారు. ఈవీఎంలో ఆయనకు 16వ స్థానం కేటాయించారు. అందుకు తగ్గట్టుగా ఈవీఎంలో అభ్యర్థి పేరు, పక్కన ఫొటోలు కూడా ఏర్పాటు చేశారు. ఓటర్లు ఎవరికి కావాలనుకుంటు వారికి ఓటు వేయడానికి పక్కన ఓ పచ్చ బటన్ ఉటుంది. అయితే, ఆ ఈవీఎంలో మిగిలిన 15 మంది పేర్ల పక్కన బటన్ ఉంది. కానీ, AMMK అభ్యర్థి పేరు పక్కన మాత్రమే బటన్ లేదు. దీంతో ఓటు వేయడానికి వెళ్లిన వారు దాన్ని గుర్తించి ఫిర్యాదు చేశారు. ఈ విషయం పార్టీల నేతలకు కూడా తెలిసింది. దీంతో ఎన్నికల అధికారులు వెంటనే స్పందించారు. ఆ పోలింగ్ స్టేషన్‌లో పోలింగ్‌ను వాయిదా వేశారు.

సాధారణంగా పోలింగ్ మొదలు పెట్టడానికి ముందే ఎన్నికల సిబ్బంది ఈవీఎంలను తనిఖీ చేస్తారు. మాక్ పోలింగ్ నిర్వహించి, ఏ పార్టీ అభ్యర్థికి ఓట్లు పడుతున్నాయా? అని కరెక్టుగా చెక్ చేస్తారు. అయితే, అసలు అభ్యర్థి పేరు పక్కన బటన్ లేకపోవడాన్ని కూడా ఎన్నికల సిబ్బంది గుర్తించలేకపోవడంపై AMMK సిబ్బంది మండిపడుతున్నారు.First published: April 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...