బీజేపీ, జనసేన కూటమి... ‘టీడీపీ’పై కీలక వ్యాఖ్యలు

ఏపీలో తమకు కేవలం జనసేనతో మాత్రమే రాజకీయ సంబంధాలు, పొత్తులు ఉంటాయని బీజేపీ నేత సునీల్ దియోదర్ స్పష్టం చేశారు.

news18-telugu
Updated: January 16, 2020, 4:17 PM IST
బీజేపీ, జనసేన కూటమి... ‘టీడీపీ’పై కీలక వ్యాఖ్యలు
పవన్ కళ్యాణ్, కన్నా లక్ష్మీనారాయణ
  • Share this:
ఏపీలో జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడటంతో... అందరి దృష్టి టీడీపీపైనే నెలకొంది. 2014 ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసి పని చేయడంతో... టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇదే విషయాన్న బీజేపీ, జనసేన నేతలు పదే పదే చెబుతుంటారు. తాజాగా మరోసారి బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడటంతో... టీడీపీ కూడా ఈ కూటమిలో చేరే అవకాశం ఉంటుందేమో అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. రాబోయే ఎన్నికల్లో మరోసారి ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉందని టీడీపీకి చెందిన అనేక మంది నేతలు అభిప్రాయపడ్డారు. అయితే ఇలాంటి వాటికి ఏపీ బీజేపీ ఇంఛార్జ్ సునీల్ దియోదర్ చెక్ పెట్టారు.

ఏపీలో తమకు కేవలం జనసేనతో మాత్రమే రాజకీయ సంబంధాలు, పొత్తులు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. టీడీపీతో తమకు ఎలాంటి పొత్తులు ఉండబోవని వివరించారు. వైసీపీ కూడా తమకు దూరమే అని వ్యాఖ్యానించారు. మొత్తానికి ఎన్నికలకు కొన్నేళ్ల ముందే ఏపీలో ఏర్పడిన బీజేపీ, జనసేన కూటమిలో టీడీపీకి ప్రస్తుతానికి చోటు లేనట్టే కనిపిస్తోంది.
First published: January 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>