ఛలో ఆత్మకూరుకు టీడీపీ నేతలు అనుమతి అడగలేదు : గుంటూరు ఎస్పీ

గుంటూరులో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు.టీడీపీ-వైసీపీ నేతలు పోటాపోటీగా ఆత్మకూరుకు బయలుదేరడంతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

news18-telugu
Updated: September 11, 2019, 1:24 PM IST
ఛలో ఆత్మకూరుకు టీడీపీ నేతలు అనుమతి అడగలేదు : గుంటూరు ఎస్పీ
నారా లోకేష్
  • Share this:
ప్రశాంతంగా ఉన్న పల్నాడులో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించబోమని గుంటూరు రూరల్ ఎస్పీ జయలక్ష్మీ హెచ్చరించారు.ఛలో ఆత్మకూరుకు టీడీపీ నేతలు అసలు అనుమతి కూడా అడగలేదని అన్నారు. వైసీపీ నేతలు అనుమతి అడిగినా శాంతిభద్రతల దృష్ట్యా అనుమతి ఇవ్వలేదని చెప్పారు.నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గుంటూరు జిల్లా మొత్తం కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. బుధవారం గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జయలక్ష్మి మాట్లాడారు.

ఇదిలా ఉంటే,గుంటూరులో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు.టీడీపీ-వైసీపీ నేతలు పోటాపోటీగా ఆత్మకూరుకు బయలుదేరడంతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ముందస్తు చర్యల్లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు,ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సహా పలువురు నేతలను హౌజ్ అరెస్ట్ చేశారు.

First published: September 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు