Home /News /politics /

NO PANCHAYATHI ELECTIONS IN THAT VILLAGE

AP Panchayat Elections:ఏపి వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల హాడావిడి కనిపించినా..!అక్కడ మాత్రం నో-ఎలక్షన్... నో-ఓటింగ్!

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు

ఏపి వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల హాడావిడి కనిపించినా..!అక్కడ మాత్రం నో-ఎలక్షన్... నో-ఓటింగ్... ఆ గ్రామస్థులు ఇప్పటి వరక పంచాయతీ ఎన్నికల మొహం ఎరుగరూ..ఇంతకీ ఏపీలో ఆ ఊరు ఎక్క‌డుంద‌నుకుంటున్నారా? అయితే ఈ స్టొరీ చ‌ద‌వాల్సిందే!

  మ‌న రాష్ట్రం నుంచే కాదు ఇత‌ర రాష్ట్రాలు ఆ మాట‌కొస్తే ఇత‌ర దేశాల నుంచి కూడా వ‌స్తోన్న భ‌క్తుల‌తో ఎప్పుడు రద్దీతో బిజీ బిజీగా ఉండే గ్రామం అది. నిత్యం లక్షలాది మంది భక్తులు యాత్రకు వచ్చి ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటే ఎంత బాగుంటుందో అని ఆశపడే అద్భుతమైన వాతావరణం ఆ గ్రామం సొంతం. అసలు ప్రపంచంలోనే ఆ ప్రదేశం తెలియని వారే లేనప్పటికీ ఆ ప్రాంతంలో ఎన్నికల హడావిడి మాత్రం కనిపించదు. ఇంతకీ ఆ గ్రామం మరేదో కాదు ఏడు కొండ‌లవాడ స‌న్నిధి తిరుమ‌ల‌. నిత్యం లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడుతూ.....గోవింద నామ స్మరణ తప్ప పార్టీల నమ స్మరణ మారుమ్రోగనీ పవిత్ర పుణ్యాక్షేత్రం తిరుమల.. కలియుగ వైకుంఠంగా పిలువబడే  తిరుమల కూడా ఒక గ్రామమే అని అతితక్కువ మందికి మాత్రమే తెలుసు.. ఎప్పటి నుండో తరతరాలుగా ఇక్కడే ఉండి తిరుమలలో దుకాణాలు  నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారే.. దశాబ్దాల క్రితం వరకూ భక్తులు అతికొద్ది మంది మాత్రమే తిరుమలకు చేరుకునే వారు.. స్వామి వారు కొలువైయున్న స్ధానం దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో చీకటి పడితే చాలు ఆలయ ప్రాంతం అంతా వన్యమృగాల సంచారంతో నిండి పోయేది.. ఈ నేపధ్యంలో కొందరు తిరుమలను నివాసయోగ్యంగా చేసుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి వివిధ  చేసి ప్రయత్నంలో భాగంగా తిరుమలలో బాలాజీ నగర్ ఏర్పాటు కాబడింది..దీంతో స్ధానికంగా ఉన్న వారినే ఉద్యోగులుగా తీసుకోవడంతో ఇక్కడ నివాసం ఏర్పరుచుకున్న వారితో ఓ గ్రామంగా తయారైంది.

  వందల్లో ఉన్న స్థానికుల సమాఖ్య క్రమేపి వేలసంఖ్య చేరుకుంధీ. 1910లో వంద ఉన్న స్ధానికుల సంఖ్య....,పెరుగుతూ వ‌చ్చింది అది ముప్పై వేలకు చేరింది..1975 వరకూ చుట్టూ ఏర్పడిన నివాస గృహాల మధ్యనే శ్రీవారి ఆలయం ఉండేది..కాల క్రమేపి శ్రీవారిని దర్శించుకునే వారి సంఖ్య పెరగడంతో మాస్టర్ ప్లాన్ లో భాగంగా శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న నివాస గృహాలను టిటిడి తోలగించింది..అయితే వారిలో కొందరికి తిరుమలలోని బాలజీ కాలనీలో నివాసం ఏర్పాటు చేయగా..మరి కొందరికి తిరుపతిలో నివాసం కల్పించింది..వారికి జీవనా ధారం కోసం వారికి ఆలయానికి సమీపంలో షాపులను కేటాయించింది..  దీంతో ప్రస్తుతం బాలాజీ నగర్లో 1060 ఇండ్లు ఆర్బీ సెంటర్ లో కేవలం ఆరవై ఇళ్ళు మాత్రమే మిగిలింది.. ఒకానోక సమయంలో ముప్పై వేల వరకూ ఉన్న తిరుమల స్ధానికుల సంఖ్య ఇరవై వేల వరకూ ఓటర్లు ఉండే వారు..అయితే 2019 ఓటర్ల జాబితా ప్రకారం ఐదు వేల నూట అరవై నాలుగుకి ఆ సంఖ్య చేరుకుంది..పేరుకి తిరుమల గ్రామ పంచాయతీ అయినప్పటికి ఇక్కడ పంచాయతీ ఎన్నికలు జరగవు..

  దేవదాయ శాఖ నిబంధనలు మేరకు తిరుపతిలోని అలిపిరి నుండి తిరుమల వరకూ ప్రత్యేక ప్రదేశంగా నిర్ధేశించారు..1964 నుండి టిటిడి ఈవోనే పంచాయతీ అధికారికి కొనసాగుతూ వచ్చారు..ఈ నేపధ్యంలో తిరుమలలో పంచాయతీ ఎన్నికలు జరపాలని స్ధానికులు కోర్టు మెట్లు ఎక్కినప్పటికి వారు వేసిన కేసుని కోర్టు కొట్టి వేసింది..అయితే ప్రస్తుతం తిరుమలలో ఉన్న స్ధానికులు ఎంపీ,ఎమ్మెల్యే ఎన్నికలకు మాత్రమే అర్హలుగా ఉన్నారు..ఎన్నికల్లో పాల్గోనే అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం అందించే సంక్షేమ పధకాలు చాలా కాలం వరకూ తిరుమల వాసులకు దక్కలేదు..ప్రజల మనస్సును దోచుకున్న సినీనటుడు, పేద పాలిట కరుణామయుడైన నందమూరి తారక రామారావు స్ధానికులకు సమస్యలను తెలుసుకుని వారికి సంక్షేమ పధకాలు అందించారు..
  Published by:Balakrishna Medabayani
  First published:

  Tags: Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Ap cm ys jagan mohan reddy, AP News, Tirumala, Tirupati

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు