మా నాన్నమ్మ, ముత్తాత కంటే మోదీయే గొప్ప..రాహుల్ బ్రదర్ కామెంట్స్

వరుణ్ గాంధీ పిలిభిత్ నుంచి పోటీచేస్తుండగా...ఆయన తల్లి మేనకా గాంధీ సుల్తాన్ పూర్ నుంచి బరిలో ఉన్నారు. మూడో విడత ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 23న పిలిభిత్ లోక్‌సభకుక ఎన్నికలు జరగనున్నాయి.

news18-telugu
Updated: April 8, 2019, 7:40 PM IST
మా నాన్నమ్మ, ముత్తాత  కంటే మోదీయే గొప్ప..రాహుల్ బ్రదర్ కామెంట్స్
ఇందిరా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, రాహుల్ గాంధీ
  • Share this:
గాంధీ-నెహ్రూ ఫ్యామిలీకి చెందిన బీజేపీ నేత వరుణ్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీని ప్రశంసించే క్రమంలో సొంత కుటుంబాన్ని తక్కువచేసి మాట్లాడారు. దేశానికి ప్రధాని నరేంద్ర మోదీ చేసినంత సేవ.. తన సొంత కుటుంబం నుంచి ప్రధానిగా పనిచేసిన వాళ్లు సైతం చేయలేదని వ్యాఖ్యానించారు. పరోక్షంగా సొంత నాన్నమ్మ ఇందిరాగాంధీ, ముత్తాత జవహర్‌లాల్ నెహ్రూ కంటే నరేంద్ర మోదీయే గొప్ప అని చెప్పారు. పిలిభిత్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు వరుణ్ గాంధీ. ఎన్నికల వేళ వరుణ్ చేసిన ఈ కామెంట్స్ దేశరాజకీయాల్లో కాక రేపుతున్నాయి.

నిజాయతీగా చెబుతున్నా..! మా కుటుంబలోనూ కొందరు ప్రధానమంత్రులుగా పనిచేశారు. కానీ భారత దేశానికి మోదీ తెచ్చినంత కీర్తి వాళ్లెవరూ తీసుకురాలేదు. ఏళ్ల తరబడి పాలించినా దేశానికి ఎవరు ఏం చేయలేదు. కానీ నరేంద్ర మోదీ దేశం కోసమే జీవిస్తారు. దేశం కోసమే మరణిస్తారు. మోదీ ఒక్కరే దేశం గురించి ఆలోచిస్తారు.
వరుణ్ గాంధీ, బీజేపీ ఎంపీ


వరుణ్ గాంధీ


ఐదేళ్ల నరేంద్ర మోదీ పాలనలో అవినీతికి తావు లేదని ప్రశంసించారు వరుణ్. ఆయనకు దేశమే కుటుంబమని.. అలాంటప్పుడు ఎవరి కోసం ఆయన అవినీతికి పాల్పడుతారని అభిప్రాయపడ్డారు. కొందరు మోదీపై అవినీతి ఆరోపణలు చేసినా.. అవి అసత్యాలేనని తేలిందని ఆయన చెప్పారు.




వరుణ్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కజిన్ బద్రర్. ఐదో తరం నెహ్రూ- గాంధీ కుటుంబ సభ్యుల్లో ఆయనే పిన్నవయస్కుడు (39). వరుణ్ గాంధీ తండ్రి సంజయ్ గాంధీ దివంగత ప్రధాని ఇందిరా గాంధీకి చిన్న కుమారుడు. రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ ఇందిరాకు పెద్ద కుమారుడు. 1980లో విమాన ప్రమాదంలో సంజయ్ గాంధీ మరణించిన తర్వాత..ఆయన భార్య మేనకా గాంధీ ఫ్యామిలీ నుంచి విడిపోయారు. అప్పుడు చిన్నపిల్లాడిగా ఉన్నారు వరుణ్. ప్రస్తుతం తల్లీకొడుకులు బీజేపీలో ఉన్నారు.

కాగా, కొన్ని నెలల ముందు వరుణ్ గాంధీ బీజేపీ హైకమాండ్ పట్ల అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం జరిగింది. తమ కుటుంబ పార్టీ కాంగ్రెస్‌లోకి వెళ్తారని ఊహాగానాలు వినిపించాయి. కానీ అదేమీ జరగలేదు. వరుణ్ గాంధీ పిలిభిత్ నుంచి పోటీచేస్తుండగా...ఆయన తల్లి మేనకా గాంధీ సుల్తాన్ పూర్ నుంచి బరిలో ఉన్నారు. మూడో విడత ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 23న పిలిభిత్ లోక్‌సభకుక ఎన్నికలు జరగనున్నాయి.
First published: April 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు