ఆ విషయంలో కేంద్రానికి శివసేన మద్దతు.. మోదీతో ఉద్ధవ్ భేటీ

CAA వల్ల దేశంలో ఏ ఒక్కరికీ నష్టం జరగదన్నారు ఉద్ధవ్ థాక్రే. NPRను మహారాష్ట్రల్లో అమలు చేస్తామని స్పష్టం చేశారు.

news18-telugu
Updated: February 21, 2020, 7:28 PM IST
ఆ విషయంలో కేంద్రానికి శివసేన మద్దతు.. మోదీతో ఉద్ధవ్ భేటీ
ప్రధాని మోదీతో ఉద్ధవ్ థాక్రే, ఆదిత్య థాక్రే
  • Share this:
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. సీఎం హోదాలో తొలిసారిగా హస్తినలో పర్యటించిన ఆయన.. కుమారుడు ఆదిత్యతో కలిసి ప్రధానితో భేటీ అయ్యారు. పౌరసత్వ సవరణ చట్టం(CAA), జాతీయ పౌర పట్టిక (NRC), జాతీయ జనాభా పట్టిక (NPR) చర్చలు జరిపారు. CAA వల్ల దేశంలో ఏ ఒక్కరికీ నష్టం జరగదన్నారు ఉద్ధవ్ థాక్రే. NPRను మహారాష్ట్రల్లో అమలు చేస్తామని స్పష్టం చేశారు. పౌరసత్వ చట్టంపై దేశవ్యాప్తంగా పలుచోట్ల ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. మోదీ, ఉద్ధవ్ థాక్రే భేటీ హాట్‌టాపిక్‌గా మారింది.

CAA, NRC, NPR అంశాలపై మా పార్టీ వైఖరిని స్పష్టం చేశాం. సీఏఏ గురించి దేశంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. NPR వల్ల దేశం నుంచి ఎవరూ గెంటివేయబడరు. ప్రజల్లో అపోహలను తొలగించాల్సిన అవసరం ఉంది.
ఉద్ధవ్ థాక్రే


First published: February 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading